Amrita Rao-Anmol’s Baby Veer: ప్రముఖ బాలీవుడ్ నటి మోడల్ అమృతా రావు ఆర్జే అన్మోల్ దంపతులు తమ ముద్దుల తనయుడిని మొదటిగా ప్రపంచానికి పరిచయం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆర్జే అన్మోల్ తన భార్య అమృత, కుమారుడు వీర్ తో కలిసి ఉన్న క్యూట్ ఫోటోని షేర్ చేశారు. మా ఇంట్లో కొత్త సభ్యుడి రాకతో ఆనందం వెల్లివిరుస్తోంది అనిపించేలా ఉంది ఆ ఫొటో.
నటి అమృత రావు, ప్రఖ్యాత ఆర్జే అన్మోల్ దంపతులకు 2020 నవంబర్ 1 న పండంటి అబ్బాయి పుట్టాడు., తాజాగా ఈ దంపతులు అన్మోల్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా బేబీ వీర్ మొదటి పూర్తి చిత్రాన్ని పంచుకున్నారు. అంతేకాదు మా ప్రపంచం లో మా ఆనందం వీర్ తోనే అంటూ ఆ ఫోటో కి ఒక క్యాప్షన్ కూడా జత చేశారు.
ఇక అమృతా, ఆర్జే ఆన్‌మోల్ దంపతులకు వీర్ మొదటి సంతానం. కాగా గత నెలలో(అక్టోబర్) తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అమృతారావు, ఆర్జే అన్‌మోల్ ఏడేళ్ల పాటు ప్రేమించుకుని, 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు.
మోడలింగ్ రంగం నుంచి రాజశ్రీ బ్యానర్ లో వివాహ్ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టింది అమృత రావు..ఇష్క్‌విష్క్, మై హూనా వంటి బాలీవుడ్ సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగు ప్రిన్స్ మహేష్ బాబు సరసన అతిధి సినిమాలో నటించింది. ఇక మరాఠా నాయకుడు బాల్ ఠాక్రే జీవితం ఆధారంగా గతేడాది తెరకెక్కిన ఠాక్రే సినిమాలో ఆమె చివరిసారిగా నటించారు. విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్య మీనా పాత్రలో జీవించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు.
Also Read:: కార్తీక్, మోనిత రిలేషన్ ను ప్రశ్నించిన ఆదిత్య.. అన్న తప్పులను ఎత్తిచూపిన తమ్ముడు