Amitabh Bachchan: అమితాబ్ చివరి జీతం ఎంతో తెలుసా ?.. కోల్ కత్తాలో గడిపిన జీవితాన్ని గుర్తుచేసుకున్న బిగ్ బీ..

|

Dec 01, 2022 | 3:33 PM

Amitabh Bachchan Trivia: తాను హీరో కాకముందు కోల్ కత్తాలో గడిపిన రోజులను.. ఉద్యోగం చేస్తూ.. ఎనిమిది మందితో కలిసి ఒకే గదిలో ఉండేవారని గుర్తుచేసుకున్నారు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్.

Amitabh Bachchan: అమితాబ్ చివరి జీతం ఎంతో తెలుసా ?.. కోల్ కత్తాలో గడిపిన జీవితాన్ని గుర్తుచేసుకున్న బిగ్ బీ..
Amitabh
Follow us on

ఓ సామాన్యుడు.. చిత్రపరిశ్రమలోనే మెగాస్టార్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే బీటౌన్ ఇండస్ట్రీలోకి నటుడిగా అరంగేట్రం చేసి.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆయన అత్యంత ధనిక చలనచిత్ర నటుల జాబితాలో ఒకరిగా ఉన్నారు. ఈరోజుకు ఆయన వద్ద విలాసవంతమైన ఇళ్లు.. లగ్జరీ వస్తువులు.. ఖరీదైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఇంతకీ ఆ నటుడు ఎవరు అనుకుంటున్నారా ? . అతనే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్.ఉత్తరాది ప్రేక్షకులను మెగాస్టార్. ప్రస్తుతం లగ్జరీ లైఫ్ గడుపుతున్న అమితాబ్ ఒకప్పుడు ఒక గదిలో దాదాపు ఎనిమిది మందితో కలిసి ఉండేవాళ్లు. అప్పట్లో ఆయన జీతం కేవలం రూ. 1640. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన బ్లాగ్ లో వెల్లడించారు.

“1968 లో అప్పట్లో కోల్ కత్తాలో నివసించేవాడిని. 10 బై 10 సైజు ఉన్న రూంలో నాతోపాటు మరో ఏడుగురు ఉండేవారు. సాయంత్రం వేళ నా స్నేహితులతో కలిసి అక్కడ పాపులర్ రెస్టారెంట్ల దగ్గరికి వెళ్లేవాడ్ని. కానీ అందులో వెళ్లడానికి సరిపడ డబ్బు మా దగ్గర ఉండేది కాదు. కానీ ఎప్పటికైనా ఆ రెస్టారెంట్లోకి వెళ్లగలిగే స్థాయికి చేరతాననే ఆశ మాత్రం నాలో ఉండేది. నటన ప్రపంచంలోకి రాకముందు కోల్ కత్తాలోని బ్లాకర్స్ అనే కంపెనీలో పనిచేసేవాడిని. అప్పట్లో నెలకు రూ. 1640 జీతం. 1968 నవంబర్ 30 నా చివరి జీతం తీసుకున్నాను.. ఇప్పటికీ ఆ రసీదు నా దగ్గరే భద్రంగా ఉంది. ఆ జాబ్ కు ముందు ఉద్యోగం లేక చాలా రోజులపాటు చెప్పులు అరిగేలా రోడ్లపై తిరిగాను”. అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

నటన ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత పూర్తిగా మారిపోయింది. ఇప్పటికీ సినిమా షూటింగ్స్ ఉన్నా.. కోల్ కత్తాకు వెళ్లినప్పుడు తన స్నేహితులను కలుస్తుంటాను అంటూ తన బ్లా్గ్ లో చెప్పుకొచ్చాడు. అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ ద్వారా దాదాపు ప్రతిరోజూ తనకు సంబంధించిన అప్‌డేట్‌లను ఇస్తూనే ఉంటారు. కొన్నిసార్లు బిగ్ బీ తన షో కౌన్ బనేగా కరోడ్‌పతికి సంబంధించిన విషయాలను పంచుకుంటారు.