బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. అక్షయ్ కుమార్ ఏడాది ఐదు, ఆరు సినిమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇక కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు అక్షయ్. తన పని తాను చేసుకుంటూ ఎప్పుడు బిజీగా ఉంటాడు అక్షయ్. అక్షయ్ గురించి పెద్దగా నెగిటివ్ వార్తలు కూడా ఎక్కడా రాలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు అక్షయ్. సినిమాలతో పాటు అక్షయ్ కుమార్ యాడ్స్ లోనూ చేస్తున్నాడు. తాజాగా అక్షయ్ కుమార్ కొత్త పాన్ మసాలా ప్రకటనలో నటించాడు. అక్షయ్ నటించిన ఈ కొత్త యాడ్ ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటుంది.
అక్షయ్ కుమార్ ‘ పాన్ మసాలా’ అంబాసిడర్ గా ఉన్నాడు. గతంలో అక్షయ్ కుమార్ పాన్ మసాలా యాడ్ లో నటించడం పై ఆయన అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాంతకం అయిన పాన్ మసాలా యాడ్ లో నటించడం పై అక్షయ్ కుమార్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అక్షయ్ కుమార్ పై వ్యతిరేకత రావడంతో ప్రేక్షకులకు క్షమాపణ చెప్పాడు. షూట్ చేసిన ప్రకటనను డీల్ ముగిసే వరకు ప్రసారం చేస్తారని కూడా ఆయన చెప్పారు. ఇటీవల విమల్ కొత్త ప్రకటన ప్రసారం చేశారు. అందులో అక్షయ్ కూడా కనిపించాడు. దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు అక్షయ్. ఈ ప్రకటన అక్టోబర్ 13, 2021న షూట్ చేశారు. ఇప్పుడు ఆ బ్రాండ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికే షూట్ చేసిన యాడ్‌ను వచ్చే నెలాఖరు వరకు ప్రసారం చేసే హక్కు వారికి ఉంది. దీంతో ఇది పాత యాడ్ అని స్పష్టం చేశారు. ఈ వైరల్ యాడ్ చూసిన చాలా మంది అది పాత యాడ్ అయి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ యాడ్ లో షారూఖ్ ఖాన్ కూడా నటించాడు. షారుఖ్ పొడవాటి జుట్టుతో ఈ యాడ్‌లో కనిపించాడు. ‘పఠాన్’ సినిమా షూటింగ్ సమయంలోనే అంత పొడవాటి జుట్టుతో కనిపించాడు షారుఖ్. అందుకే, అదే పాత యాడ్ అయి ఉంటుందని అంటున్నారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.