Salman Khan: సికందర్ ఎఫెక్ట్.. ఆ డైరెక్టర్‌తో మల్టీ స్టారర్‌ సినిమాను షురూ చేసిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం సికందర్. రంజాన్ కానుకగా రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా ఆశాజనకంగా లేవు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్ గా నటించింది.

Salman Khan: సికందర్ ఎఫెక్ట్.. ఆ డైరెక్టర్‌తో మల్టీ స్టారర్‌ సినిమాను షురూ చేసిన సల్మాన్ ఖాన్
Salman Khan

Updated on: Apr 03, 2025 | 9:53 AM

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన తాజా సినిమా ‘సికందర్’ కు ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. ఈ సినిమా సల్మాన్ అభిమానులను బాగా డిజప్పాయింట్ చేసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సికందర్ రిజల్ట్ గురించి పట్టుకోకుండా తదుపరి సినిమాపై సల్మాన్ దృష్టి పెట్టాడు. తాజాగా కండల వీరుడి కొత్త సినిమా గురించి ఒక అప్‌డేట్ వచ్చింది . సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడు . ఆ సినిమా టైటిల్ గురించి ఇప్పుడు సమాచారం వినిపించింది. ఈ చిత్రానికి ‘గంగా రామ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. గతంలో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ కలిసి ‘చల్ మేరే భాయ్’, ‘సాజన్’ వంటి చిత్రాల్లో నటించారు. చాలా సంవత్సరాల తర్వాత వారు మళ్ళీ కలిసి నటించబోతున్నారని తెలిసి అభిమానులు థ్రిల్ అయ్యారు. ఇది యాక్షన్ సినిమాగా ఉండనుంది. కొత్త దర్శకుడు క్రిష్ అహిర్ ఈ మల్టీ స్టారర్ మూవీకి దర్శకత్వం వహించనున్నారు.

‘గంగా రామ్’ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కథకు భారీ బడ్జెట్ అవసరం కాబట్టి సల్మాన్ ఖాన్ మరో నిర్మాణ సంస్థతో చేతులు కలపాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ‘గంగా రామ్’ టైటిల్ గురించి అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. దర్శకుడు క్రిష్ అహిర్ గత 5 సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు, సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ కాంబినేషన్ సినిమా కోసం అఅతను ఒక మంచి కథను సిద్ధం చేశారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఆల్ఫా మేల్స్ పాత్రలు పోషిస్తారని వార్తలు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ జూన్ లేదా జూలైలో ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇటీవల, సంజయ్ దత్ , సల్మాన్ ఖాన్ అభిమానులకు మరో గొప్ప వార్త అందింది. వారిద్దరూ ఒక హాలీవుడ్ సినిమాలో అతిథి పాత్రల్లో నటించారు. ఆ సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితం దుబాయ్‌లో జరిగింది. దానికి సంబంధించిన అప్‌డేట్ కోసం అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..