భూల్‌ భులయ్యా 2 సినిమా యూనిట్‌కు షాక్‌లు ఇస్తున్న సీనియర్ నటి టబు.. పెండింగ్‌లో ఉన్న సీన్లకు నో..!

|

Feb 05, 2021 | 9:23 PM

దాదాపు అన్ని ఇండస్ట్రీలలో లాక్‌ డౌన్‌ రిస్ట్రిక్షన్స్‌ ఎత్తేశారు. ఫిలిం ఫీల్డ్‌ కూడా ఆల్మోస్ట్ నార్మల్‌ అయిపోయింది. దాదాపు అందరూ షూటింగ్‌లకు వచ్చేస్తున్నారు.

భూల్‌ భులయ్యా 2 సినిమా యూనిట్‌కు షాక్‌లు ఇస్తున్న సీనియర్ నటి టబు.. పెండింగ్‌లో ఉన్న సీన్లకు నో..!
Follow us on

దాదాపు అన్ని ఇండస్ట్రీలలో లాక్‌ డౌన్‌ రిస్ట్రిక్షన్స్‌ ఎత్తేశారు. ఫిలిం ఫీల్డ్‌ కూడా ఆల్మోస్ట్ నార్మల్‌ అయిపోయింది. దాదాపు అందరూ షూటింగ్‌లకు వచ్చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఓ సీనియర్‌ నటి మాత్రం షూటింగ్‌కు నో అంటున్నారు. భూల్‌ భులయ్యా 2 సినిమా యూనిట్‌కు షాకుల మీద షాకులిస్తున్నారట బాలీవుడ్‌ బ్యూటీ టబు. లాక్ డౌన్‌ ఎత్తేసి ఇన్ని రోజులవుతున్నా ఇప్పటికీ షూటింగ్‌కు వచ్చేందుకు నో అంటున్నారట.

లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో 2020 మార్చిలో భూల్‌ భులయ్యా 2 షూటింగ్‌ వాయిదా పడింది. ఆ తరువాత అక్టోబర్‌లోనే షూటింగ్‌ రీస్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్ .. కానీ సిచ్యుయేషన్స్‌ సెట్ కాకపోవటంతో  షూట్‌ను డిసెంబర్‌కు పోస్ట్ పోన్ చేశారు. ఆ టైంలోనూ షూటింగ్‌కు టబు నో చెప్పటంతో జనవరి ఎండింగ్‌ నుంచి షూటింగ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పటికీ షూటింగ్‌కు నో అంటున్నారట టబు.

మిగతా ఆర్టిస్ట్‌లకు సంబంధించిన షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. టబు కాంబినేషన్‌ సీన్సే ఇప్పుడు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ ఆమె మాత్రం షూటింగ్‌ నో అంటే నో అని గట్టిగా చెబుతున్నారట. దీంతో చేసేదేమి లేక మరోసారి షూటింగ్ పోస్ట్ పోన్‌ చేసింది యూనిట్‌. ఈ సారి ఏకంగా జూలైకి షెడ్యూల్‌ పోస్ట్ పోన్ అయింది. అప్పటికైనా కోవిడ్‌ కంప్లీట్‌గా కంట్రోల్లోకి వస్తే టబు షూట్‌కి వస్తారేమో అన్న ఆశతో ఉన్నారు భూల్‌ భులయ్యా మేకర్స్‌.

Also Read:

Actress Vinitha : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన వెంకటేష్ హీరోయిన్.. రీ ఎంట్రీకి సిద్ధంగా ఉందట..

సుమక్కకు పోటీగా దిగిన వంటలక్క.. అక్కడ కూడా వంటింట్లో దూరి దోశలేస్తున్న.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..