Ajay Devgn : వరుస సినిమాలతో బిజీ బిజీగా బాలీవుడ్ హీరో.. మరో సినిమాను లైన్‌లో పెట్టిన అజయ్ దేవగన్
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు...
Ajay Devgn : బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇక బాలీవుడ్ లో బిజీ హీరోల్లో అజయ్ ఒకరు. నటుడిగా నిర్మాతగా వరుస సినిమాతో దూసుకు పోతున్నాడు అజయ్. ఈ క్రమంలో త్వరలో మరో ప్రాజెక్ట్ ను మొదలు పెట్టనున్నాడట ఈ హీరో. బేబీ.. స్పెషల్ చెబ్బీస్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు నీజర్ పాండే ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.
ఇటీవల హిస్టారికల్ మూవీ ‘తనాజీ’ సినిమాతో ఆకట్టుకున్న అజయ్ దేవగన్ ఈ సారి చాణక్య సినిమాతో మెప్పించేందుకు సిద్దం అవుతున్నాడు. చాణుక్యుడి పాత్ర ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక అజయ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ తోపాటు ‘మైదాన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అటు నిర్మాతగా అమితాబ్, రకుల్ ప్రధాన పాత్రలో ‘మేడే’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం చాణక్య సినిమాపై బాలీవుడ్ ఇండస్ట్రీ వార్తలు చక్కర్లుకొడుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :
అరుదైన ఘనత సాధించిన కీర్తిసురేశ్.. ‘ఫోర్బ్స్’ ఇండియా 2021లో చోటు దక్కించుకున్న ‘మహానటి’..