Janhvi Kapoor: యాటిట్యూడ్ క్వీన్.. జాన్వీ కపూర్‏ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

|

Dec 04, 2021 | 3:38 PM

సెలబ్రెటీల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. వారి పర్సనల్ విషయాలు.. సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకునే

Janhvi Kapoor: యాటిట్యూడ్ క్వీన్.. జాన్వీ కపూర్‏ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..
Janhvi Kapoor
Follow us on

సెలబ్రెటీల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. వారి పర్సనల్ విషయాలు.. సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అటు స్టార్ హీరోహీరోయిన్స్ కూడా తమ అభిమానులకు టచ్‏లో ఉంటున్నారు. అభిమానులతో ముచ్చటిస్తూ.. సినీ అప్డేట్స్ షేర్ చేసుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు సెలబ్రెటీలను నెట్టింట్లో ఎక్కువగా ట్రోల్ చేస్తుంటారు. వారు ఏం చేసినా.. వారి డ్రెస్సింగ్ గురించి.. శారీరాకృతి గురించి సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తుంటారు. అయితే నెటిజన్స్ కామెంట్స్‏కు కొందరు స్టార్స్ స్ట్రాంగ్ ఆన్సర్స్ ఇవ్వగా.. మరికొందరు చూసి చూడనట్టు వదిలేస్తారు.

ఇటీవల బాలీవుడ్ స్టార్ దంపతులు అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్య రాయ్‏ల గారాలపట్టి ఆరాధ్య నడక పై ఎన్నో కామెంట్స్ చేశారు. తన కూతురుపై ట్రోల్స్ చేసేవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అభిషేక్.. ఇక తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు హీరోయిన్ జాన్వీ కపూర్ పై ఇష్టానుసారంగా కామెంట్స్ చేశారు నెటిజన్స్. జాన్వీ కపూర్ దఢక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఈ అమ్మడు వరుస చిత్రాలతో బిజీగా గడిపేస్తుంది. ఇటీవల జాన్వీ కపూర్ తన సొదరి, స్నేహితులతో కలిసి ఎక్కడికో వెళ్లి వస్తూ కెమెరాలకు చిక్కింది. జాన్వీని ఫోటోలకు ఫోజులివ్వమని ఫోటోగ్రాఫర్లు అడగ్గా.. పట్టించుకోకుండా వెళ్లి కారులో కూర్చుంది. ఈ వీడియోను సెలబ్రెటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్ స్టాలో లో షేర్ చేశారు. ఇంకేముందు ఈ వీడియో చూసిన నెటిజన్స్ మేడమ్ యాటిట్యూడ్ చూడండి అంటూ కామెంట్స్ చేశారు.

Also Read: Katrina Kaif: కత్రినా పెళ్లికి ఎంతమంది వీఐపీలు వస్తున్నారంటే!.. వివరాలు వెల్లడించిన రాజస్థాన్‌ అధికారులు..

Mahesh Babu MEK: మహేష్‌, ఎన్టీఆర్‌ల సందడికి సమయం ఆసన్నమైంది.. ఎవరు మీలో కోటీశ్వరులు టెలికాస్ట్‌ అయ్యేది..

Deepika padukone: ‘చూపులు గుచ్చుకోవడం అంటే ఇదేనేమో’.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన వాలు కళ్ల వయ్యారి