Deepika Padukone: ఏడో తరగతిలోనే తొలిసారి కవిత రాసాను.. ఆసక్తికర పోస్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్..

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో దీపికా పదుకొణె (Deepika Padukone) ఒకరు. అతి తక్కువ సమయంలోనే వరుస సినిమాలు చేస్తూ అగ్రకథనాయికగా మారింది.

Deepika Padukone: ఏడో తరగతిలోనే తొలిసారి కవిత రాసాను.. ఆసక్తికర పోస్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్..
Deepika

Updated on: Apr 11, 2022 | 6:42 AM

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో దీపికా పదుకొణె (Deepika Padukone) ఒకరు. అతి తక్కువ సమయంలోనే వరుస సినిమాలు చేస్తూ అగ్రకథనాయికగా మారింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‏స్టాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. “తొలిసారిగా.. చివరిసారిగా నేను రాసిన కవిత.. ఏడో తరగతిలో ఉన్నప్పుడు నాకు 12 ఏళ్లు. మా టీచర్లు మమ్మల్ని రెండు పదాలతో (ఐ యామ్) ఏదైనా కవిత రాయమన్నారు. నేను అవే పదాలతో టైటిల్ పెట్టి కవిత రాశాను. అలా కవిత రాయడం మళ్లీ ఎప్పుడూ జరగలేదు. ” అంటూ దీపికా తాను రాసిన కవిత గురించి చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం దీపికా పదుకొణె.. స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సరసన పఠాన్ సినిమాలో నటిస్తోంది. దీపికా పదుకొణె ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొణె కూతురు. దీపికా 16 ఏళ్ల వయసులో మోడలింగ్ వైపు అడుగులేసింది. దీపికా ప్రస్తుతం పఠాన్ సినిమాతోపాటు.. ఫైటర్ సినిమాలోనూ నటిస్తోంది. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ కే చిత్రంలోనూ నటిస్తోంది. ఈ సినిమాతో మొదటి సారి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతుంది.

Also Read: RRR Movie: జక్కన్న క్రియేట్ చేసిన నయా ట్రెండ్.. అలాంటి పాటే కావాలంటున్న స్టార్ హీరోలు

Prabhas: త్వరలోనే నయా లుక్‌లో కనిపించనున్న డార్లింగ్.. మారుతి సినిమాకోసం మరోసారి అలా…

Pawan Kalyan Fans: ఊరికే హీరోలైపోరు మరి.. పవర్ స్టార్ స్పెషల్‌ ట్రైనింగ్ పై ఫ్యాన్స్ ఏమంటున్నారంటే

Alia Bhatt : ‘ఆర్ఆర్ఆర్’ ముంబై ఈవెంట్‌లో సీతమ్మ కనిపించకపోవడానికి కారణం ఇదేనా..