Akshay Kumar: స్టార్ హీరో ఇంట తీవ్ర విషాదం.. అక్షయ్ కుమార్ తల్లి మృతి.. భావోద్వేగ పోస్ట్ చేసిన నటుడు..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి అరుణ భాటియా బుధవారం ఉదయం కన్నుమూశారు.

Akshay Kumar: స్టార్ హీరో ఇంట తీవ్ర విషాదం.. అక్షయ్ కుమార్ తల్లి మృతి.. భావోద్వేగ పోస్ట్ చేసిన నటుడు..
Akshay Kumar

Updated on: Sep 08, 2021 | 10:53 AM

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి అరుణ భాటియా బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆమెను సెప్టెంబర్ 3న ముంబాయిలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఆరోగ్యం మరింత విషమించడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. ఎమోషనల్ పోస్ట్ చేశారు.

మా అమ్మ అరుణ భాటియా.. ఈరోజు ఉయం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. వేరే లోకంలో ఉన్న నా తండ్రిని ఆమె కలుసుకోవడానికి వెళ్లారు. ఆమె నా ప్రాణం. ఆమె మరణం వలన వాకు కలిగిన బాధను మాటల్లో వివరించలేను. ఈ బాధను భరించలేను. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో నా కుటుంబం కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞతలు.. ఓం శాంతి అంటూ అక్షయ్ ట్వీట్ చేసారు. అరుణ భాటియా మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సంతాపం ప్రకటిస్తున్నారు.

ట్వీట్..

అక్షయ్ కుమార్ ప్రస్తుతం సిండ్రెల్ల సినిమా చేస్తున్నారు. గత రెండు వారాల నుంచి ఈ మూవీ షూటింగ్ లండన్‏లో జరుగుతుంది తన తల్లి అస్వస్థతకు గురైందని విషయం తెలియగానే అక్షయ్ కుమార్ హుటాహుటిన ముంబైకు వచ్చారు.

Also Read: Brinjal Benefits: వంకాయలను తింటే గుండె సమస్యలు ఫసక్.. ప్రయోజనాలు తెలిస్తే ఇట్టే తినేస్తారు..

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల కొత్త ప్రభుత్వం..వర్గాల లెక్కలు తేలలేదు..పాలన గందరగోళమే!