Samantha: బాలీవుడ్‌లో సమంతకు బంపరాఫర్‌.. కీలక ఒప్పందం చేసుకున్న బడా నిర్మాణ సంస్థ.?

|

Dec 01, 2021 | 10:45 AM

Samantha: ఇటీవల సమంత ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొన్నటి వరకు విడాకుల వ్యవహారంతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచిన సామ్‌ ప్రస్తుతం.. సినిమా అవకాశాల విషయంలో కూడా సమంత అందరి దృష్టిని...

Samantha: బాలీవుడ్‌లో సమంతకు బంపరాఫర్‌.. కీలక ఒప్పందం చేసుకున్న బడా నిర్మాణ సంస్థ.?
Samantha
Follow us on

Samantha: ఇటీవల సమంత ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొన్నటి వరకు విడాకుల వ్యవహారంతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచిన సామ్‌ ప్రస్తుతం.. సినిమా అవకాశాల విషయంలో కూడా సమంత అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే తెలుగులో పలు వరుస అవకాశాలను సొంతం చేసుకున్న ఈ అందాల తార ఏకంగా హాలీవుడ్‌లోనూ నటించే ఆఫర్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్‌ 2 సిరీస్‌తో బాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితురాలైన సామ్‌ ఇప్పుడు ముంబయి బాట పట్టనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీటిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదని చెప్పాలి.

ఇదిలా ఉంటే తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు బాలీవుడ్‌కు చెందిన బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ సమంతతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒకేసారి మూడు సినిమాలకు ఒప్పందం చేసుకునేందుకు సమంతకు ప్రపోజల్‌ పెట్టారంట సదరు నిర్మాణ సంస్థ వాళ్లు. ఇందుకోసం సామ్‌ కోసం భారీగా ముట్టజెప్పేందుకు కూడా సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక సమంత కూడా ఈ డీల్‌కు సానుకూలంగానే స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి.

మరి ఇందులో ఎంత వరకు నిజం ఉదంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలుగులో శాకుంతలం చిత్రాన్ని పూర్తి చేసిన సమంత.. ప్రస్తుతం పుష్ప రాజ్‌ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ పాటకు సంబంధించి చిత్ర యూనిట్‌ విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

Also Read: Kangana Raunat: నన్ను చంపేస్తామంటున్నారు.. సోనియాజీ మీరూ స్పందించాలి.. కంగన విజ్ఞప్తి..

Sirivennela Seetharama Sastry: వస్తానన్నారు.. కలుస్తాన్నన్నారు.. కానీ ఇలా జీవంలేకుండా వస్తారనుకోలేదు.. ఎమోషనల్ అయిన చిరంజీవి