తాప్సీ పొన్ను, అనురాగ్ కశ్యప్ ఇళ్లపై దాడుల్లో పన్ను ఎగవేత ఆధారాలు లభించాయి. ఐటీ శాఖ

| Edited By: Anil kumar poka

Mar 06, 2021 | 1:15 PM

బాలీవుడ్ సెలబ్రిటీలు తాప్సి పొన్ను, అనురాగ్ కశ్యప్ ఇళ్ళు, కార్యాలయాలపై తాము నిర్వహించిన సోదాలు, దాడుల్లో వీరు పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఆధారాలు లభించాయని ఐటీ శాఖ అధికారులు తెలిపారు.

తాప్సీ పొన్ను, అనురాగ్ కశ్యప్ ఇళ్లపై దాడుల్లో పన్ను ఎగవేత ఆధారాలు లభించాయి. ఐటీ శాఖ
Follow us on

బాలీవుడ్ సెలబ్రిటీలు తాప్సి పొన్ను, అనురాగ్ కశ్యప్ ఇళ్ళు, కార్యాలయాలపై తాము నిర్వహించిన సోదాలు, దాడుల్లో వీరు పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఆధారాలు లభించాయని ఐటీ శాఖ అధికారులు తెలిపారు. తమ దాడుల్లో ..ఒకప్పుడు కశ్యప్ నేతృత్వంలో ఉన్న ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థ.. చూపిన ఆదాయానికి, బాక్స్ ఆఫీసు వసూళ్లకు మచ్య చాలా తేడా ఉన్నట్టు తెలిసిందన్నారు. సుమారు 300 కోట్ల తేడాను ఈ సంస్థ అధికారులు వివరించలేకపోయినట్టు వారు చెప్పారు. ఫిల్మ్ డైరెక్టర్లు, షేర్ హోల్డర్ల మధ్య ఈ కంపెనీవారు నిర్వహించిన షేర్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ఆధారాలను మానిప్యులేట్ చేశారని (అవకతవకలు) దాదాపు 350 కోట్ల పన్ను చెల్లించలేదని అర్థమైందని ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెప్పారు.

ఇక యాక్టర్ (తాప్సి పొన్ను) దాదాపు 5 కోట్ల సొమ్ముకు సంబంధించిన క్యాష్ రసీదులు తాము స్వాధీనం చేసుకున్నట్టు వారు తెలిపారు. కాగా- కశ్యప్ ఆధ్వర్యంలోని ఫాంటమ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ ..2011 లో లూటేరా, క్వీన్, అగ్లీ, ఎన్-10, ఉడ్తా పంజాబ్ వంటి చిత్రాలు నిర్మించింది. ఏడేళ్ల తరువాత అనురాగ్ కశ్యప్.. ఈ సంస్థను మూసేసి, ‘గుడ్ బ్యాడ్ ఫిల్మ్స్’ అనే సంస్థను ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండగా..ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ను ఈ ఐటీ దాడుల విషయమై మీడియా ప్రశ్నించగా 2013 లో కూడా తాప్సి పొన్ను వంటి సెలబ్రిటీల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయని, కానీ అప్పుడు అది సమస్య కాలేదని, ఇప్పుడు మాత్రం ఇష్యు అయిందని వ్యాఖ్యానించారు. ఇది ప్రస్తుతం దేశ సమస్యగా మారినట్టు కనిపిస్తోందన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నవారి ఇళ్లపై ఇలా ఈడీ, ఐటీ దాడులు  జరుగుతున్నాయన్న విమర్శలను ఆమె కొట్టిపారేశారు. ఈ దాడుల అంశానికి మరీ అంత ప్రాధాన్యం ఇవ్వరాదన్న రీతిలో ఆమె మాట్లాడారు. కాగా తాప్సి పొన్ను తన ట్వీట్లలో..2013 నాటి దాడుల విషయాన్ని వ్యంగ్యంగా ప్రస్తావించింది.

మరిన్ని చదవండి ఇక్కడ :

స్పర్మ్ డొనేట్ చేస్తే లక్షల్లో డబ్బులు..డబ్బులు లేక చేసిన పని లక్షల్లో ఆదాయం చూపింది : Sperm Donor Video.

విజయనగరం యువతి ఫేక్‌స్టోరీ! కాళ్లుచేతులు కట్టేసుకుని..తానే నాటకం ఆడినట్టు అంగీకారం : girl kidnap video