అజయ్‌ దేవగన్‌కు పితృవియోగం.. బాలీవుడ్‌లో విషాదం

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తండ్రి, ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వీరు దేవగన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 80కి పైగా బాలీవుడ్ చిత్రాలకు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన వీరు దేవగన్.. నటుడిగా, నిర్మాతగా కూడా పనిచేశారు. దర్శకుడిగా తన కుమారుడు అజయ్ దేవగన్‌తో హిందూస్థాన్ కీ కసమ్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయన మృతితో బాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు ఆయన మృతిపై సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. […]

అజయ్‌ దేవగన్‌కు పితృవియోగం.. బాలీవుడ్‌లో విషాదం

Edited By:

Updated on: May 27, 2019 | 3:26 PM

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తండ్రి, ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వీరు దేవగన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 80కి పైగా బాలీవుడ్ చిత్రాలకు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన వీరు దేవగన్.. నటుడిగా, నిర్మాతగా కూడా పనిచేశారు. దర్శకుడిగా తన కుమారుడు అజయ్ దేవగన్‌తో హిందూస్థాన్ కీ కసమ్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయన మృతితో బాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు ఆయన మృతిపై సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా వీరు దేవగన్ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 6గంటలకు జరగనున్నట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.