AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kriti Sanon: ఇంకెప్పుడు మారుతారు? కుక్కకు రాఖీ కట్టడానికి కారణమిదే.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్

ఆదిపురుష్ ఫేమ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ రీసెంట్ గా ఓ వివాదంలో చిక్కుకుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆమె చేసిన యాడ్ లో వెస్ట్రన్ దుస్తులు ధరించడం, అలాగే కుక్కకు కూడా రాకీ కట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనికి సంబంధించి కృతిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Kriti Sanon: ఇంకెప్పుడు మారుతారు? కుక్కకు రాఖీ కట్టడానికి కారణమిదే.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్
Kriti Sanon
Basha Shek
|

Updated on: Aug 25, 2026 | 7:02 PM

Share

ఆదిపురుష్ భామ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ఊహించని విధంగా ఓ వివాదంలో చిక్కుకుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆమె నటించిన రక్షా బంధన్ యాడ్ లో ఆమె ధరించిన దుస్తులు తీవ్ర వివాదస్పదమయ్యాయి. దీనికి తోడు సోదరులకు ప్రేమతో కట్టే రాఖీని కుక్కకు కట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కంగనా రనౌత్ లాంటి సినీ ప్రముఖులు సైతం కృతి సనన్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. హిందూ పండగలను అవమానించేలా కృతి సనన్ వ్యవహరించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై వస్తోన్న విమర్శలు, సోషల్ మీడియా ట్రోల్స్ పై కృతి సనన్ స్పందించింది. ఈ మేరకు ఇన్ స్టా స్టోరీస్ లో వరుస పోస్టులు పెట్టింది. ‘పండుగ అనేది భావోద్వేగాలు, సంప్రదాయాలతో కూడుకున్నది. అంతే కానీ మనం ధరించే దుస్తుల్లో ఉండదు. రక్షాబంధన్ అనేది ఒక రక్షణ బంధం. నేను, నా సోదరి ఒకరికొకరం రాఖీ కట్టుకుంటాం. ఒక సోదరుడు ఎలాగైతే రక్షణగా ఉంటారో.. మేము కూడా అలాగే రక్షించుకోగలమని మాకు తెలుసు. తాను, తన సోదరి ఒకరి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయువు కోసం ప్రార్థించుకుంటాం. ఇది మా ఇంట్లో కుక్కలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే అవీ కూడా మా కుటుంబంలో సభ్యులే కదా’ అని కృతి రాసుకొచ్చింది. .

ఇక ఈ ప్రకటనలో తాను ధరించిన దుస్తులపై వస్తోన్న విమర్శలకు కూడా కృతి కౌంటర్ ఇచ్చింది. ‘ మనం మహిళలు ఏమి ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతాం? ఒక మహిళ తన సంస్కృతి పట్ల చూపే గౌరవాన్ని ఆమె దుస్తులను బట్టి అంచనా వేసే పద్ధతి సరైనది కాదు. ఎథ్నిక్ ఫ్యాషన్ సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది.. కానీ ఇప్పటికీ ఒక మహిళ తన సంస్కృతి పట్ల చూపే గౌరవాన్ని కేవలం ఆమె దుస్తులతోనే కొలుస్తున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు అనే మహిళ హృదయంలో ఉంటాయి.. అంతే కానీ ఆమె మెడలో కాదు’ అని పేర్కొంది కృతి సనన్. ప్రస్తుతం ఈ హీరోయిన్ పోస్టుల నెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు కృతికి సపోర్టుగా నిలుస్తుంటే మరికొందరు ఆమెపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కృతి సనన్ ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ పోస్ట్..

Kriti Sanon Instagram Post

Kriti Sanon Instagram Post

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అందుకే కుక్కకు రాఖీ కట్టాను.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్
అందుకే కుక్కకు రాఖీ కట్టాను.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్
ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే ఫ్రాంచైజీని వదిలేసుడే..
ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే ఫ్రాంచైజీని వదిలేసుడే..
చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..
చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!
మెటా బాస్ జుకర్ బర్గ్ కొన్న ఐరిష్ భవంతి గతం .. విషాదాంతం ..
మెటా బాస్ జుకర్ బర్గ్ కొన్న ఐరిష్ భవంతి గతం .. విషాదాంతం ..
వందల కోట్ల ఆస్తులు.. అయినా సారథి స్టూడియో అమ్మడానికి కారణం అదే..
వందల కోట్ల ఆస్తులు.. అయినా సారథి స్టూడియో అమ్మడానికి కారణం అదే..
ఒక్క ప్రయోగం.. అది కూడా ఫెయిల్యూర్..! 2026లో ఇస్రో టార్గెట్ ఇదే..
ఒక్క ప్రయోగం.. అది కూడా ఫెయిల్యూర్..! 2026లో ఇస్రో టార్గెట్ ఇదే..
సముద్రపు లోతుల్లోకి సరికొత్త శక్తి.. నేవీలోకి చేరనున్న INS నిపుణ్
సముద్రపు లోతుల్లోకి సరికొత్త శక్తి.. నేవీలోకి చేరనున్న INS నిపుణ్
రాసిపెట్టుకోండి.. భారత్ WTC ఫైనల్ చేరడం పక్కా..
రాసిపెట్టుకోండి.. భారత్ WTC ఫైనల్ చేరడం పక్కా..
హోటల్‌లో వై-ఫై వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..
హోటల్‌లో వై-ఫై వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..