Sye Raa: చిరు మూవీ రైట్స్ దక్కించుకున్న బాలీవుడ్ హీరో.. అధికారిక ప్రకటన
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ హిందీ రైట్స్‌ను ప్రముఖ బాలీవుడ్ నటుడు పర్హాన్ అక్తర్ దక్కించుకున్నారు. రితేష్ సిద్వానీ, ఏఏ ఫిలింస్‌తో కలిసి ఫర్హాన్ సైరాను హిందీలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోను […]
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ హిందీ రైట్స్‌ను ప్రముఖ బాలీవుడ్ నటుడు పర్హాన్ అక్తర్ దక్కించుకున్నారు. రితేష్ సిద్వానీ, ఏఏ ఫిలింస్‌తో కలిసి ఫర్హాన్ సైరాను హిందీలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన నిర్మాతలు.. అందులో సినిమాలో నటించిన మెయిన్ కారెక్టర్స్ పోస్టర్లను పెట్టారు.
కాగా మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించాడు. ఇక ఇందులో మెగాస్టార్ సరసన నయనతార నటించగా.. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్, రవి కిషన్, తమన్నా, అనుష్క, నిహారిక తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్, పోస్టర్లతో ఆకట్టుకున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ తారాగణం నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఒకేరోజు విడుదల కానుంది. కాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఈ మూవీ మేకింగ్ వీడియోను బుధవారం విడుదల చేయనున్న విషయం తెలిసిందే.
BIGGG NEWS… Ritesh Sidhwani, Farhan Akhtar and AA Films to distribute *Hindi* version of #SyeRaaNarasimhaReddy. #SyeRaa pic.twitter.com/uusBoCJwZ9
— taran adarsh (@taran_adarsh) August 13, 2019