AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 7 ఏళ్లుగా సహ జీవనం.. ఇద్దరు పిల్లలు.. టాలీవుడ్ హీరోయిన్‌తో పెళ్లి పీటలెక్కిన బాలయ్య విలన్

ఈ ప్రేమ పక్షులు సుమారు ఏడేళ్లుగా సహ జీవనం సాగిస్తున్నారు. వీరి ప్రేమకు ప్రతీకగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే ఇప్పుడీ లవ్ బర్డ్స్ పెళ్లితో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. గోవా వేదికగా అధికారికంగా పెళ్లి పీటలెక్కారు.

Tollywood : 7 ఏళ్లుగా సహ జీవనం.. ఇద్దరు పిల్లలు.. టాలీవుడ్ హీరోయిన్‌తో పెళ్లి పీటలెక్కిన బాలయ్య  విలన్
Arjun Rampal, Gabriella
Basha Shek
|

Updated on: Aug 22, 2026 | 9:58 AM

Share

‘ధురందర్’ సినిమాలో విలన్ గా నటించి పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన నటుడు అర్జున్ రాంపాల్ రెండో వివాహం చేసుకున్నాడు. తన ప్రియురాలు గాబ్రియెల్లా డెమెట్రియాడెస్‌తో కలిసి అధికారికంగా మూడు ముళ్ల బంధలోకి అడుగు పెట్టాడు. ఉత్తర గోవాలోని మపుసా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. శుక్రవారం (ఆగస్టు 21) సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రేమ పక్షులు ఉత్తర గోవాలోని మపుసాలో ఉన్న సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ సాధారణ దుస్తులు ధరించి ఉన్నారు. రిజిస్టర్ మ్యారేజ సమయంలో వారితో పాటు కొందరు స్నేహితులు, సన్నిహితులు కూడా ఉన్నారు. అర్జున్-గాబ్రియెల్లాల వివాహం గోవా యూసీసీ (UCC) కింద నమోదు చేయబడిందని సబ్-రిజిస్ట్రార్ సూరజ్ వెర్నేకర్ తెలిపారు. కాగా అర్జున్, గాబ్రియెల్లా 2018 నుంచి కలిసి ఉంటుననారు. చాలా కాలం పాటు సహజీవనం చేసిన తర్వాత, వీరిద్దరూ డిసెంబర్ 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు అధికారికంగా పెళ్లిపీటలెక్కారు.

అర్జున్ రాంపాల్, గాబ్రియెల్లా డెమెట్రియాడెస్‌లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2019లో అరిక్ జన్మించగా, 2023లో ఆరవ్ పుట్టాడు. కాగా వీరికి బాలీవుడ్ లో మంచి పాపులారిటీ క్రేజ్ ఉంది. అయితే తమ వ్యక్తిగత జీవితాల విషయంలో మాత్రం చాలా గోప్యతను పాటిస్తారు. ఇక అర్జున్ భార్య విషయానికి వస్తే.. గాబ్రియెల్లా డెమెట్రియాడెస్ దక్షిణాఫ్రికాలో పుట్టి పెరిగింది. కేవలం 16 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనర్ గానూ సత్తా చాటింది. ఆ తర్వాత నటిగా సినిమాల్లోకి అడుగు పెట్టింది. పలు హిందీ సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించిన ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. అక్కినేని నాగార్జున, కార్తీ హీరోలుగా నటించిన ‘ఊపిరి’ సినిమాలో గాబ్రియెల్లా కీలక పాత్రలో నటించింది.

ఇవి కూడా చదవండి

గోవాలో అధికారికంగా పెళ్లి..

ఇది అర్జున్ రాంపాల్‌ విషయానికి వస్తే.. ఒకప్పుడు హిందీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ఆ తర్వాత సహాయక నటుడిగానూ, విలన్ గానూ రాణిస్తున్నారు. ఈ నటుడు తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. బాలకృష్ణ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ భగవంత్ కేసరిలో అర్జున్ రాంపాల్ విలన్ గా నటించాడు. ఇక ఈ నటుడి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. గతంలో మాజీ సూపర్‌మోడల్, వ్యాపారవేత్త అయిన మెహర్ జెస్సియాను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 1998లో వివాహం చేసుకున్నారు. వీరికి మహిక, మైరా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు రెండోసారి వివాహంతో మళ్లీ వార్తల్లో నిలిచారు.

గాబ్రియెల్లాతో అర్జున్ రాంపాల్..

View this post on Instagram

A post shared by Arjun Rampal (@rampal72)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us