Bobby Simha : ‘రౌడీబేబీ’ మూవీ నుంచి పోస్టర్.. ఎన్‌కౌంటర్ రవిగా అదరగొడుతున్న స్టార్ హీరో

యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సందీప్..

Bobby Simha : 'రౌడీబేబీ' మూవీ నుంచి పోస్టర్.. ఎన్‌కౌంటర్ రవిగా అదరగొడుతున్న స్టార్ హీరో
Follow us
Rajeev Rayala

| Edited By: Rajesh Sharma

Updated on: Jan 07, 2021 | 2:50 PM

Bobby Simha : యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సందీప్.. చాలారోజుల తర్వాత ‘నిను వీడని నీడను నేనే’ అంటూ ఓ హిట్ అందుకున్నాడు. అంతేగాక అదే సినిమాతో సందీప్ నిర్మాతగా కూడా మారాడు. తాజాగా సందీప్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రౌడీబేబీ’. గత నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న రౌడీ బేబీ మూవీ టీమ్. తాజాగా తమిళ స్టార్ యాక్టర్ బాబీ సింహా కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రబృందం. నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కోన వెంకట్ సమర్పణలో ఎంవివి సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు