Pranitha Subhash : మొహానికి సూదులు గుచ్చుకున్న హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో
'ఏం పిల్లో ఏం పిల్లాడో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ప్రణీత శుభాష్. ఈ అమ్మడు ఆతర్వాత ఒకటి రెండు సినిమాలు చేసిన అవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి.
Pranitha Subhash : ‘ఏం పిల్లో ఏం పిల్లాడో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ప్రణీత శుభాష్. ఈ అమ్మడు ఆతర్వాత ఒకటి రెండు సినిమాలు చేసిన అవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. ఆ ఆతర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమాతర్వాత రామ్ నటించిన ‘హలో గురు’ ప్రేమ కోసమే సినిమాలో తన నటనతో అందంతో కట్టిపడేసింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. కొద్దీ రోజుల క్రితం మాల్ దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. తాజాగా ప్రణీత పోస్ట్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతుంది. అందమైన తన మొహానికి సూదులు గుచ్చి ఉన్న ఫొటోని షేర్ చేసి అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది ఒక రకమైన వైద్యం.. ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో ఇది ఒక భాగం . ఒంట్లోని నొప్పులను సూదులు గుచ్చి నయం చేస్తారు. ఇది చైనాలోని పురాతన వైద్య విధానం. ఇప్పుడు ప్రణీత కూడా ఇలాంటి వైద్యం చేయించుకున్నట్టు తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Hero Nithin Visits Tirumala : కాలినడకన తిరుమల కొండెక్కిన యంగ్ హీరో.. సోషల్ మీడియాలో సెల్ఫీ
నేను గే ను కాను, ట్రాన్స్ జెండర్ గా మారిన బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్, ఎందుకంటే ? ఇది నా అభిమతం