Rakul Preet Singh : మరో బాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకున్న రకుల్ ప్రీత్.. మరోసారి ఆ యంగ్ హీరోతో

అందాల భామ రకుల్ ప్రీత్ ఇటు తెలుగులో అటు హిందీలో అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటికే తెలుగులో బిజీ హీరోయిన్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లోను అదృష్టాన్ని...

Rakul Preet Singh : మరో బాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకున్న రకుల్ ప్రీత్.. మరోసారి ఆ యంగ్ హీరోతో
తెలుగులో క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేస్తుంది రకుల్. గ్రామీణ నేపథ్యంలో రూపొందే ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ విలేజ్ గర్ల్ గా డీ గ్లామర్ రోల్ పోషిస్తోంది. రకుల్ ఆశలన్నీ ఈ సినిమా పైనే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 07, 2021 | 2:37 PM

Rakul Preet Singh : అందాల భామ రకుల్ ప్రీత్ ఇటు తెలుగులో అటు హిందీలో అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటికే తెలుగులో బిజీ హీరోయిన్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లోను అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటుంది. గతంలో ఈ బ్యూటీ బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్ధ మల్హోత్రాతో లవ్ ట్రాక్ నడిపిందని టాక్ వచ్చింది.ఇద్దరు చట్టపట్టాలేసుకు తిరిగారు కూడా.. అయితే రకుల్ ఈ జోడీ కలిసి మరోసారి పెద్ద తెరపై సందడి చేయబోతున్నారు.

రకుల్ ఇప్పటికే అజయ్ దేవ్ గన్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న`మేడే` చిత్రీకరణలో పాల్గొంటోంది. అమితాబ్ బచ్చన్- అజయ్ దేవ్ గన్ కాంబినేషన్ తో ఆన్ లొకేషన్ కలిసి పని చేస్తోంది. రకుల్ మరో భారీ చిత్రానికి సంతకం చేసింది ఈ సినిమాలో సిద్ధార్థ్  ఒక హీరో కాగా  అజయ్ దేవగన్  మరొక హీరోగా కనిపించనున్నారు. టీసిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `థాంక్ గాడ్` అనే టైటిల్ ని ప్రకటించారు. ఇంద్ర కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమా ప్రారంభమవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి: 

Pranitha Subhash : మొహానికి సూదులు గుచ్చుకున్న హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో