Bigg Boss 4 Telugu updates: ప్రేక్షకులను అలరించేందుకు ‘బిగ్‌బాస్ 4’ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సీజన్‌కి సంబంధించిన లోగోతో పాటు ఇందులో హోస్ట్‌గా నాగార్జున లుక్‌కి సంబంధించిన వీడియోను విడుదల చేశారు నిర్వాహకులు. దీంతో బిగ్‌బాస్ 4పై ఉన్న అనుమానాలన్నీ తొలిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ షో ప్రారంభం అయ్యేందుకు మరో 20 రోజుల సమయం పట్టనుందని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆగష్టు 30 నుంచి ఈ షోను ప్రారంభించబోతున్నట్లు సమాచారం.
ఇక కరోనా నేపథ్యంలో చాలా జాగ్రత్తలతో ఈ సీజన్‌ను నిర్వహించబోతున్నారట నిర్వాహకులు. ఈ క్రమంలో ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్‌లను ఎంపిక చేసుకోవడంతో పాటు వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచినట్లు టాక్. వారితో పాటు టెక్నికల్ సిబ్బందిని కూడా క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎక్స్‌ట్రా కంటెస్టెంట్‌లను కూడా సెలక్ట్ చేశారని, చివరి నిమిషంలో ఎవరైనా డ్రాప్ అయితే వారి స్థానంలో ఎక్స్‌ట్రా కంటెస్టెంట్‌లను తీసుకోబోతున్నారని సమాచారం. మొత్తానికి కరోనా నిబంధనలను పాటిస్తూ ఏ మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గకుండా ఈ సీజన్‌ని నిర్వాహకులు ప్రారంభించబోతున్నట్లు టాక్. మరి ఈ షో ఎప్పుడు ప్రారంభం అవ్వబోతోంది..? ఇందులో ఎవరెవరు పాల్గొనబోతున్నారు..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
Read This Story Also: తెలుగులో వస్తున్న తొలి ‘జాంబీ’ చిత్రం : ‘జాంబీ రెడ్డి’