
బిగ్ బాస్ రియాల్టీ షోకు అన్ని భాషలలోనూ మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 విజయవంతంగా ముగిసింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈషోలో కామనర్ కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు. అయితే ఇప్పటివరకు తెలుగులో లేడీ విన్నర్ కాలేదు,. కేవలం బిగ్ బాస్ ఓటీటీలో మాత్రం హీరోయిన్ బింధు మాధవి టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే..ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9లో లేడీ టైగర్ విజేతగా నిలిచింది. హీరో విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తున్న ఈ షో.. సీజన్ 9 అక్టోబర్ 5, 2025న ప్రారంభమై, జనవరి 18, 2026న ముగిసింది. ఈ సీజన్ మొత్తం 20 మంది పోటీదారులతో ప్రారంభమైంది. అలాగే దివ్య గణేష్ , అమీత్, సాండ్రా ఆమె భర్త ప్రజిన్ సహా 4 మంది పోటీదారులు 3వ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా అడుగుపెట్టారు.
ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‌కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‌తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..
ఈ షో గ్రాండ్ ఫినాలే జనవరి 18న ఆదివారం సాయంత్రం విజయవంతంగా జరిగింది. ఈ సీజన్ 9 విజేతగా దివ్య గణేష్ నిలిచింది. అలాగే శబరి మొదటి రన్నరప్‌గా, వికెల్స్ విక్రమ్ రెండవ రన్నరప్‌గా నిలిచారు. దివ్య గణేష్ బిగ్ బాస్ తమిళ సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రవేశించింది. ఆమె సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యారు. భాగ్యలక్ష్మి సీరియల్‌లో జెన్నీ పాత్ర పోషించడం ద్వారా అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. బిగ్ బాస్ తమిళ సీజన్ 9 లో తన ఆట తీరు, మాటలతో కట్టిపడేసింది.
ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‌ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..
జనవరి 18, 2026న జరిగిన గ్రాండ్ ఫినాలేలో, విజయ్ సేతుపతితో పాటు శబరి , దివ్య గణేష్ వేదికపై ఉన్నారు. అందులో, విజయ్ సేతుపతి దివ్య గణేష్ చేయి పైకెత్తి ఆమెను బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విజేతగా ప్రకటించారు. ఈ షోలో విజేతగా నిలిచిన దివ్య గణేష్ రూ.50 లక్షల బహుమతిని గెలుచుకుంది.
ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..