మూడవ మాయాస్త్ర ఎవరి సొంతమైందనే ఉత్కంఠ మధ్య మొదలైన బిగ్ బాస్ సీజన్ 7 21st ఎపిసోడ్.. హా నాన్ని సాంగ్‌తో మొదలైంది. ఎప్పటిలానే నాగ్ మెస్మరైజ్ లుక్స్.. చూసే వారందర్లో ఎపిసోడ్ పై ఎక్కడలేని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇక నాగ్ వచ్చీ రాగానే శుక్రవారం అంటే సెప్టెంబర్ 23న హౌస్‌లో ఏం జరిగిందో చూడండంటూ.. బీబీ లవర్స్‌కు చూపించిన నాగార్జున.. తను కూడా హౌస్‌లో కంటెస్టెంట్స్ మాటలను వింటూ ఉంటారు. అందులోనూ. సుబ్బు, శోభ మధ్య సాగే ఎమోషనల్ కన్వర్‌జేషన్‌ను.. వాళ్లు ఎమోషనల్ అయ్యే తీరును స్టేజ్ పై నుంచే గమనిస్తూ ఉంటారు. తేజ వల్ల.. తనుకు రాత్రుళ్లు నిద్ర లేకుండా పోతుందని బిగ్ బాస్‌కు కంప్లైట్ చేసిన సందీప్ మాటలను విని నవ్వకుంటూ ఉంటారు. ఇంతలో రతిక ప్రిన్స్ రోల్ ప్లే చేస్తూ.. యాక్ట చేయగా ఒక్కసారిగా షాక్ అయిన నాగార్జున.. ఆ తరువాత రతిక పర్ఫార్మెన్స్‌ను చూసి నవ్వుకుంటారు.
ఇక ఈ క్రమంలోనే ఉన్నట్టుండి బిగ్ బాస్ అందర్నీ లివింగ్ ఏరియా సోఫాలోకి రమ్మని ఆదేశిస్తాడు.అతిథి వెబ్ సిరీస్‌ను ట్రైలర్‌ను చూపించి అందర్నీ భయపెడతాడు. కొద్ది సేపు కంటెస్టెంట్స్‌తో ఆటాడుకుంటాడు.ఇక ఇందంతా స్టేజ్ మీద నుంచి చూస్తున్న నాగ్ అండ్ ఆడియెన్స్ నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంటారు.
ఇక ఆ తరువాత కంటెస్టెంట్స్ దగ్గరికి వచ్చిన నాగార్జున.. ప్రియాంక హెయిర్ స్టైల్‌కి ఫిదా అయిపోతారు. సూపర్ అంటూ మెచ్చుకుంటారు. ఆ తరువాత అమర్ దీప్ గుండు గీయించుకోకుండా.. గివప్ ఇవ్వడాన్ని కాస్త విమర్శించిన నాగ్.. తన మాటలతో జానకీ కలగనలేదు హీరోను తికమక పెడతారు. శోభ, ప్రియాంక మధ్య ఎవరు గెలుస్తారో చెప్పమంటూ.. మెలిక మెప్పి.. అమర్ను తల పట్టుకునేలా చేస్తారు.
ఇక ఆ తరువాత శివాజీ, సందీప్‌ను నిలుచోమని చెప్పిన నాగ్.. వాళ్లను కూడా అమర్ దీప్‌ను అడిగిన ప్రశ్ననే అడిగారు. శోభ, ప్రియాంక ఇద్దరిలో ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారంటూ.. చెప్పమన్నారు. అయితే శివాజీ సేఫ్ గేమ్ ఆడి.. చెప్పలేనంటూ మాట దాటేయగా.. సందీప్ మాత్రం ప్రియాంక అంటూ.. తన అభిప్రాయాన్ని చెబుతాడు.
ఇక తరువాత అసలేమాత్రం టైం వేస్ట్ చేయకుండా.. శోభ 12 సెకన్ల తేడాతో.. ప్రియాంక మీద గెలిచిందని లెక్కలతో సహా అనౌన్స్ చేస్తారు నాగ్. హౌస్‌లో మూడవ కన్ఫర్మర్డ్ క్యాండిడేట్ శోభ అంటూ.. అనౌన్స్ చేస్తారు. దీంతో శోభ ఎగిరి గంతేస్తారు. తెగ ఖుషీ అవుతారు.
ఇక ఆ తరువాత ప్రశాంత్‌ను స్టోర్ రూమ్‌కు వెళ్లమని చెప్పిన నాగ్.. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ మధ్య ఓ చిన్న ఫన్ అండ్ ఫిట్టింగ్ గేమ్ పెట్టేస్తారు. నామినేషన్స్‌లో సేఫ్ గేమ్ ఆడినట్టు కాకుండా.. ప్రతీ ఒక్క కంటెస్టెంట్ ప్రతీ ఒక్కరి ఆట తీరును తన ముందు రేట్ చేయాలని.. అదే ఈ గేమ్ అంటూ చెబుతారు నాగ్. ఇక ఈ గేమ్‌ను మొదట ప్రియాంకతో మొదలెట్టిన నాగ్.. కంటెస్టెంట్స్‌కు రేటింగ్ ఇవ్వమని చెబుతారు. కంటెండర్‌గా అమర్ దీప్ ను ముందు ఎన్నుకున్నావ్.. ఆ తరువాత ఎందుకు మార్చుకుంటా అని రెక్వెస్ట్ చేశావ్ అని.. ప్రియాంకను అడిగి మెలిక పెడతారు నాగ్. ఇదే క్రమంలో ‘నీ ఆట నువ్వు ఆడు’ అంటూ..అమర్ దీప్‌ను కూడా గట్టిగానే మందలిస్తారు.
ఇక ఆ తరువాత ‘నీ ఉద్దేశం ప్రకారం గేమ్ చేంజర్ ఎవరు’ అని ప్రియాంకను అడగగా.. ప్రియాంక శోభ అని చెబుతుంది. సేఫ్ ప్లేయర్ ఎవరు అని అడగగా.. మరో ఆలోచన లేకుండా సుబ్బు అని చెబుతుంది. అందుకు రీజన్ మళ్లీ వాళ్ల కిచెన్ పంచాయితీని ముందరేస్తుంది.
ఇక ఆ తరువాత సుబ్బు.. తన దృష్టిలో గేమ్ చేంజన్ యావర్ ప్రిన్స్ అని.. చెబుతుంది. దీంతో సుబ్బు నిర్ణయాన్ని అప్రిషియేట్ చేసిన నాగ్.. ఆ తరువాత సందీప్ పై సీరియస్ అవుతారు. కంటెండర్ టాస్క్‌లో శోభ, ప్రియాంక, ప్రిన్స్ మధ్యలో ఎందుకు మాట్లాడావ్ అంటూ.. అది కరెక్ట్ కాదు కదా అంటూ.. వారిస్తారు. ప్రియాంక, శోభ, ప్రిన్స్ కాకుండా.. మిగిలిన కంటెస్టెంట్స్‌ను.. సందీప్ సంచాలకుడిగా ఫెయిల్ అయ్యారా లేదా చెప్పండి అంటూ అడుగుతారు. దాంట్లో మెజారిటీ సభ్యులు సందీప్ సంచాలకుడిగా ఫెయిల్ అని చెప్పడంతో.. నాగ్ సందీప్ పై మరింత సీరియస్ అవుతారు. నువ్వు ఏమన్న పిస్తావా.. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ..కాస్త గట్టిగా చెబుతారు. సందీప్ బ్యాటరీని డౌన్ చేస్తారు. గ్రీన్ టూ యెల్లో గామ మార్చమని బిగ్ బాస్‌కు ఆదేశిస్తారు.
ఇక ఆ తరువాత మళ్లీ ఫిట్టింగ్ గేమ్ కంటిన్యూ చేసిన నాగ్.. సుబ్బునే సేఫ్ ప్లేయర్ ఎవరు అని అడగగా.. తేజు అంటూ చెబుతుంది. తరువాత ప్రశాంత్ దగ్గరికి వచ్చిన నాగ్.. తన దృస్టిలో గేమ్ చేజంర్ , సేఫ్ ప్లేయర్ ఎవరు అని అడగగా.. గేమ్ చేంజర్ ప్రిన్స్ యావర్ అని చెప్పగా.. సేఫ్ గేమర్ తేజగా నామినేట్ చేస్తాడు.
ఇక గౌతమ్ ఏమో.. సేఫ్ ప్లేయర్‌గా మళ్లీ తేజను నామినేట్ చేయగా.. గేమ్ చేంజర్‌గా ప్రియాంకను నామినేట్ చేసి తనకు బ్యాడ్జ్ పెడతాడు. ఇక సరిగ్గా ఇప్పుడే ఈ క్షణానే.. శోభ గొడవను.. గౌతమ్ చొక్కా తీయడాన్ని అడ్రస్ చేస్తారు నాగ్. కానీ అందరూ ఊహించినట్టు సీరియస్ అవకుండా.. చాలా లైట్‌గా తీసుకుని.. ఇలాంటి చేయాల్సిన అవసరం లేదంటూ.. వదిలేస్తారు. తన రియాక్షన్తో ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్‌తో పాటు.. బీబీ లవర్స్‌ను కూడా కాస్త డిస్సపాయింట్ చేస్తారు నాగ్.
ఇక ఆ తరువాత దామిని అమర్ దీప్‌ను సేఫ్ ప్లేయర్ అని నామినేట్ చేస్తుంది. అందుకు రీజన్గా ప్రియాంకతో అమర్ చాలా సాప్ట్‌గా సేఫ్‌గా ఉంటాడని అది కరెక్ట్ కాదని చెబుతుంది. ఆ తరువాత అమర్ దీప్ దగ్గరికి వచ్చిన నాగ్.. ఒక్కసారిగా మనోడి గాలి తీసేస్తాడు. హీరో, విలన్ అని డైలాగ్ చెప్పావ్ కదా అసలు ఎందుకు పవరాస్త్రను ఎందుకు తీశావ్ అంటూ.. అమర్ను అడిగారు నాగ్. మనోడి ఆన్సర్ విని ఆట మీద కాకుండా ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నావ్ అంటూ.. చెబుతారు. హీరో కాకుండా.. విలన్ అయ్యావ్ అంటూ.. నాగ్ విమర్శిస్తారు. ఇక ఆ తరువాత తన గేమ్ కంటిన్యూ చేసిన దామిని గేమ్ చేంజర్‌గా ప్రిన్స్ యవార్‌ను నామినేట్ చేస్తుంది. తన ఆట పట్టుదల బాగుందంటూ.. చెబుతుంది.
ఇక తేజు.. గేమ్ చేంజర్‌గా ప్రియాంకను.. సేఫ్ గేమర్‌గా అమర్ దీప్‌ను నామినేట్ చేస్తాడు. అమర్ దీప్‌కు ఊపు మిస్సైందని అందుకే సేఫ్ గేమన్ అని చెబుతాడు. ఆ తరువాత శోభ.. గేమ్ చేంజర్‌గా ప్రియాంకను.. సేఫ్ ప్లేయర్‌గా ప్రశాంత్‌ను నామినేట్ చేస్తుంది.
ఇక తరువాత వచ్చిన ప్రిన్స్ గేమ్ చేంజర్‌గా రైతు బిడ్డ ప్రశాంత్‌ను నామినేట్ చేయగా.. సేఫ్ ప్లేయర్‌గా దామినిని నామినేట్ చేస్తాడు. అందుకు కారణం అందరితో బాగుంటూ.. సేఫ్ గేమ్ ఆడుతూ.. నామనినేష్స్ నుంచి తప్పించుకుంటుంది. అందుకే సేఫ్ ప్లేయర్ తన దృష్టిలో దామిని అంటూ చెబుతాడు.
ఇక తరువాత లేచిన అమర్ దీప్ గేమ్ చేంజర్ దామని అంటూ.. సేఫ్ ప్లేయర్ రతిక అంటూ చెబుతాడు. ఇక రతిక ఏమో సేఫ్ ప్లేయర్ గా తేజని.. గేమ్ చేంజర్‌గా ప్రిన్స్ యావర్‌ను ఎన్నుకుంటుంది. ఇక తరువాత నామినేషన్స్‌లో సిల్లీ రీజన్స్ చెప్పొద్దంటూ మందలించిన నాగ్.. గేమ్ చేంజర్ గా నాలుగు బ్యాడ్జెస్ అందుకున్న ప్రిన్స్ యావర్‌ను విన్నర్ అంటూ అనౌన్స్ చేస్తారు. ఇక సేఫ్ ప్లేయర్‌గా నాలుగు బ్యాడ్జులు వచ్చిన తేజకు.. పనిష్మెంట్ ఇస్తారు. హౌస్‌లో డిషెస్ తను మాత్రమే కడగాలని… ఆదేశిస్తారు. ఇక ఆ తరువాత నామినేషన్స్‌లో ఉన్న అమర్ దీప్, ప్రియాంక, సుబ్బు, రతిక, దామిని,గౌతమ్, ప్రిన్స్ యావర్‌లలో.. ప్రిన్స్ యావర్ సేఫ్ గా తేలుతుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది.. స్టిల్ సస్పెన్స్ గానే ఉంటుంది.
మరిన్ని బిగ్‌బాస్-7 కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి