తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ మూడో సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. శివజ్యోతి ఎలిమినేట్ తరువాత హౌజ్‌లో ఐదుగురు మిగలగా.. వారందరూ సోమవారం ఎపిసోడ్‌లో దీపావళి చేసుకున్నారు. ఇక దీపావళి స్పెషల్‌గా హౌస్‌లోకి గెస్ట్‌గా వెళ్లింది యాంకర్ సుమ. తన సందడితో కంటెస్టెంట్‌లలో ఉత్సాహాన్ని నింపింది. ముందుగా హౌస్ మొత్తం ఓ రౌండ్ కొట్టేసిన సుమ.. ఆ తర్వాత ఇంటి సభ్యులతో రకరకాల విషయాలను ముచ్చటించింది. ఆ తరువాత సుమ కోసం మటన్ బిరియాని చేసి పెట్టాలని ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ సూచించాడు. దానికి సంబంధించిన వంట సామాగ్రిని కూడా హౌస్‌లోకి పంపించాడు.
ఆ తర్వాత కంటెస్టెంట్‌లతో కొన్ని ఫన్నీ టాస్క్‌లు ఆడించింది సుమ. ఆ టాస్క్‌లో భాగంగా.. హౌస్ మేట్స్ ఒక్కొక్కరుగా హెడ్ ఫోన్స్ ధరించాలి. ఆ హెడ్ ఫోన్స్‌లో మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. అదే సమయంలో సుమ కొన్ని తెలుగు వ్యాఖ్యలను చెబుతుండగా.. వాటిని కంటెస్టెంట్‌లు కరెక్ట్‌గా చెప్పాలి. అయితే విచిత్రం ఏంటంటే.. ఈ గేమ్‌లో బాగా, తొందరగా ఆన్సర్ చేసిన వారికి కాకుండా.. ఎక్కువ ఎంటర్‌టైన్ చేసిన వారికి ఎక్కువ మార్కులు రావడం విశేషం. ఈ నేపథ్యంలో వరుణ్ ఎక్కువ ఎంటర్‌టైన్ చేయగా.. అతడినే విన్నర్‌గా ప్రకటించింది సుమ. టాస్క్ తరువాత బాబా భాస్కర్ చేసిన బిరియాని తిన్న సుమ.. అతడికి కాంప్లిమెంట్లు ఇచ్చింది. ఇక భోజనాలయ్యాక.. కాసేపు కునుకు తీయాలంటూ సుమ ప్రయత్నించినా.. అంతలోపే బిగ్‌బాస్ కుక్కలు మొరిగిన వార్నింగ్ ఇవ్వడంతో ఆమె బయటకు రాలేక తప్పలేదు. మొత్తానికి హౌస్‌లో సుమ హావభావాలు, పంచ్ డైలాగ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.