బిగ్ బాస్.. ఈ షో ఫ్లాష్ బ్యాక్ ఏంటి?

|

Jul 15, 2019 | 5:33 PM

బిగ్ బాస్.. ఇప్పుడిది చాలా పాపులర్ షో అయిపొయింది. ఈ రియాల్టీ షో టీవీల్లో వస్తోందంటే..చాలు..ఆడియెన్స్ వాటికి అతుక్కుపోతారు. అసలిది ఇంతగా పాపులర్ కావడానికి కారణం.. బిగ్ బాస్ హౌస్ లో ఉండే వ్యక్తుల మధ్య (ముఖ్యంగా అపరిచితులు) ఏర్పడే అభిమానాలు, అనుబంధాలు.. తరచూ వారి మధ్య తలెత్తే గిల్లికజ్జాలు, అప్పుడప్పుడు బిగ్ బాస్ ఇచ్ఛే కష్టతరమైన టాస్క్ ల ను నిర్వహించడంలో వారి ప్రతిభ.. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వంద రోజులు.. 64 కెమెరాల […]

బిగ్ బాస్.. ఈ షో ఫ్లాష్ బ్యాక్ ఏంటి?
Follow us on

బిగ్ బాస్.. ఇప్పుడిది చాలా పాపులర్ షో అయిపొయింది. ఈ రియాల్టీ షో టీవీల్లో వస్తోందంటే..చాలు..ఆడియెన్స్ వాటికి అతుక్కుపోతారు. అసలిది ఇంతగా పాపులర్ కావడానికి కారణం.. బిగ్ బాస్ హౌస్ లో ఉండే వ్యక్తుల మధ్య (ముఖ్యంగా అపరిచితులు) ఏర్పడే అభిమానాలు, అనుబంధాలు.. తరచూ వారి మధ్య తలెత్తే గిల్లికజ్జాలు, అప్పుడప్పుడు బిగ్ బాస్ ఇచ్ఛే కష్టతరమైన టాస్క్ ల ను నిర్వహించడంలో వారి ప్రతిభ.. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వంద రోజులు.. 64 కెమెరాల మధ్య వారి ప్రవర్తనను హైలైట్ చేసే కార్యక్రమం కాబట్టే !
మొట్టమొదట వయాకామ్ ఇండియా, కలర్స్ ఛానల్ ఈ షోకి శ్రీకారం చుట్టాయి. నెదర్లాండ్స్ లో తొలుత బిగ్ బ్రదర్ పేరిట వఛ్చిన కార్యక్రమమే దీనికి ప్రేరణ. భారత ఉపఖండంలో ఏడు వివిధ భాషల్లో ఏడు వెర్హన్లు ఉండే షో ఇది ! 2006 లో మొదటి బిగ్ బాస్ రియాల్టీ షో హిందీలో ప్రసారమైంది. ఆ తరువాత కన్నడ, బెంగాలీ, తమిళం, తెలుగు, మరాఠీ, మలయాళం భాషల్లో ప్రసారమవుతూ వచ్చింది. ఆ మధ్యే హిందీ, కన్నడ, తెలుగు వెర్షన్ల షోలకు జనరల్ పబ్లిక్ ని కూడా ఆడిషన్ కి తీసుకోవడం ప్రారంభించారు.
హౌస్ మేట్లుగా వ్యవహరించే కంటెస్టెంట్లు బయటి ప్రపంచంతో గానీ, తమ కుటుంబ సభ్యులతో గానీ ఎలాంటి సంబంధాలు లేకుండా తమలో తామే తమ ఫ్యామిలీగా వ్యవహరించడమంటే ఆషామాషీ కాదు. అందుకే ఇందులో పాల్గొనేవారికి నిర్వాహకులు ఎన్నో ” విషమ పరీక్షలు ‘ పెడతారు. వారి ప్రవర్తన, వారి తెలివి తేటలు, బాడీ లాంగ్వేజ్, ఇంకా ..ఇలాగే వారికి సంబంధించిన ఎన్నో అంశాలను వడపోత పోస్తారు. సాధారణంగా ఓటింగ్ ప్రాతిపదికపై వారానికొకసారి ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు. కంటెస్టెంట్లలో ఎవరి ప్రవర్తన అయినా నచ్చకపోతే..ఒకరు వారిని ఎలిమినేట్ చేయాలని కోరితే బిగ్ బాస్ ఈ ప్రకటన చేస్తాడు. అయితే చివరివరకు నిలిచే వారే విన్నర్ అవుతారు. వారికి భారీ నగదు బహుమతి ఉంటుంది. మొదట్లో ఈ బహుమతి కోటి రూపాయలు ఉండగా .. ఆ తరువాత దీన్ని 50 లక్షలుచేశారు.

తెలుగులో స్టార్ మా ఛానల్ మొదట జూనియర్ ఎన్ఠీఆర్ తోను, అనంతరం రెండో సీజన్లో నాని తోను ఈ షో నిర్వహించింది. తాజాగా మూడో షో హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నాడు.తొలి రెండు సీజన్ షోలూ ఎలాంటి వివాదాలకూ తావివ్వకుండా కొనసాగగా.. మూడో షో మాత్రం ఓ యాంకర్, ఓ నటి చేసిన ఫిర్యాదులతో పోలీసు స్టేషన్ వరకు వెళ్లడం, నిర్వాహకులపై పోలీసులు కేసు పెట్టడం వరకు వెళ్లడమే కొసమెరుపు.