Bigg Boss 5 Telugu: ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌.. ఈరోజు ఎలిమినేట్‌ అయ్యేది కాజల్‌ కాదా.? మరెవరంటే..

Bigg Boss 5 Telugu: ఊహించింది జరిగితే దానిని బిగ్‌బాస్‌ అని ఎందుకు అంటారు.? సినిమాలను తలపించే ట్విస్టులు, ఎమోషనల్‌ సీన్లు, కామెడీ, నటన బిగ్‌బాస్‌ రియాలిటీ  షో...

Bigg Boss 5 Telugu: ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌.. ఈరోజు ఎలిమినేట్‌ అయ్యేది కాజల్‌ కాదా.? మరెవరంటే..
Biggboss Elimination

Updated on: Nov 14, 2021 | 3:02 PM

Bigg Boss 5 Telugu: ఊహించింది జరిగితే దానిని బిగ్‌బాస్‌ అని ఎందుకు అంటారు.? సినిమాలను తలపించే ట్విస్టులు, ఎమోషనల్‌ సీన్లు, కామెడీ, నటన బిగ్‌బాస్‌ రియాలిటీ  షో సొంతం. అంతా సవ్యంగా జరుగుతుంది అని అనుకునేలోపే బిగ్‌బాస్‌ ఏదో ఒక పన్నాగాన్ని పన్ని షోను రక్తి కట్టిస్తుంటాడు. ముఖ్యంగా ఎలిమినేషన్‌కు సంబంధించి ఎప్పుడు ఏదో ఒక ట్విస్ట్‌ ఇచ్చే బిగ్‌బాస్‌ ఈ సారి కూడా ప్రేక్షకులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు తెలిసిన వార్తల ప్రకారం ఈవారం హౌజ్‌ నుంచి కాజల్‌ ఎలిమినేట్‌ అవుతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వారం నామినేషన్‌లో ఉన్న సిరి, రవి, సన్నీ, కాజల్‌, మానస్‌లలో.. కాజల్‌ హౌజ్‌ను వీడి వెళ్లనుందని వార్తలు షికార్లు చేశాయి. కాజల్‌ హౌజ్‌లో యాక్టివ్‌గా ఉండడం లేదని, ఆటలో వెనకబడిపోయిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో వీటికి బలం చేకూరింది.

అయితే చివరి క్షణంలో బిగ్‌బాస్‌ అనుకోని ట్విస్ట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ వారం ఎలిమినేట్‌ అవుతోంది కాజల్‌ కాదని, ఆమె స్థానంలో జెస్సీ ఎలిమినేట్‌ అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోన్న జెస్సీని సీక్రెట్‌ రూంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే జెస్సీకి ఇంకా నయం కాకపోవడం వైద్యులు కూడా ఆయన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో ఈ వీకెండ్‌లో జెస్సీని ఇంటి నుంచి బయటకు పంపించనున్నారని వార్తలు వస్తున్నాయి.

దీంతో ఈసారి ఎలిమినేషన్‌ ప్రక్రియ లేకుండా జెస్సీని.. ఆరోగ్యం దృష్ట్యా బయటకు పంపించనున్నారన్నమాట. ఈ వార్తే కనుక నిజమైతే కాజల్‌ మంచి అవకాశం దొరికినట్లే. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్‌ వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Actor Sonu Sood: పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో సోనూ సూద్ కీలక ప్రకటన.. ఇంతకీ ఏమన్నారంటే..?

ONGC: లాభాల రికార్డు సృష్టించిన ఓఎన్‌జీసీ.. ఈ త్రైమాసికంలో రిలయన్స్ కన్నా ఎక్కువగా.. ఎంత సాధించిందంటే..

Geetha Madhuri: సోషల్ మీడియాలో సింగర్ ‘గీత మాధురి’ తెలుగుతనంలా లేటెస్ట్ ఫొటోస్..