Pallavi Dey: చిత్ర పరిశ్రమలో విషాదం.. ఫ్లాట్‌లో శవమై కనిపించిన ఆ టీవీ నటి..

పల్లవి అనుమానస్పద మృతిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

Pallavi Dey: చిత్ర పరిశ్రమలో విషాదం.. ఫ్లాట్‌లో శవమై కనిపించిన ఆ టీవీ నటి..
Pallavi Dey

Edited By:

Updated on: May 16, 2022 | 6:57 PM

Bengali TV actor Pallavi Dey : చిత్ర పరిశ్రమంలో విషాదం నెలకొంది. బెంగాలీ టెలివిజన్ నటి పల్లవి డే (25) ఆదివారం అనుమానాస్పదంగా మృతి చెందింది. కోల్‌కతాలోని గార్ఫా ప్రాంతంలో అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లో శవమై కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు. సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ వెంటనే పోలీసులు పల్లవిని కోల్‌కతాలోని ఎంఆర్‌ బంగూర్ ఆసుపత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే.. పల్లవి అనుమానస్పద మృతిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ‘మోన్ మనే నా’ టీవీ షోలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్న పల్లవి డే (25) మృతి పట్ల ఆమె సన్నిహితులు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే పల్లవి డే కుటుంబీకులు ఆమె హత్యకు గురై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పలు సీరియల్స్‌లో నటించిన పల్లవి.. సోగ్నిక్ చక్రవర్తితో కలిసి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సోగ్నిక్ చక్రవర్తి, పల్లవి డే ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండేవారని తెలిపారు. ఈ మేరకు డే బాయ్‌ఫ్రెండ్ షాగ్నిక్ చక్రవర్తిని గార్ఫా పోలీస్ స్టేషన్‌కు తరలించి ప్రశ్నిస్తున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న షాగ్నిక్.. ఉదయం బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి తలుపు వేసి ఉండటంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత తలుపు పగులగొట్టి చూడగా పల్లవి మృతదేహం వేలాడుతూ కనిపించినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Anekal Balraj: సినిమా పరిశ్రమను వెంటాడుతోన్న విషాదాలు.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత దుర్మరణం..

Sitara Ghattamaneni: ప్రకృతి అందాల మధ్య ఫ్యాషన్ గర్ల్.. సితార లేటెస్ట్ ఫొటోస్..