కరోనా: ప్రముఖ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే గ్రహీత పరిస్థితి విషమం

ప్రముఖ నటుడు, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్రా ఛటర్జీ పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల ఆయనకు కరోనా సోకగా

కరోనా: ప్రముఖ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే గ్రహీత పరిస్థితి విషమం

Edited By:

Updated on: Oct 10, 2020 | 10:46 AM

Soumitra Chatterjee Corona: ప్రముఖ నటుడు, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్రా ఛటర్జీ పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల ఆయనకు కరోనా సోకగా.. ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు, వెంటిలేటర్‌పై ఉంచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి క్షణం వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నట్లు వారు వెల్లడించారు.

కాగా ఇటీవల కేంద్రం సినిమా షూటింగ్‌లకు అనుమతిని ఇవ్వడంతో అభియాన్ షూటింగ్‌ని పూర్తి చేశారు. ఈ మూవీకి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా బారిన పడి ఉంటారని కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. కాగా సౌమిత్రా ఛటర్జీ గొప్ప నటుడు. దర్శకదిగ్గజం సత్యజిత్‌ రేకి ఆయన చాలా ఆత్మీయుడు. సత్యజిత్‌ రే తెరకెక్కించిన దాదాపు అన్ని చిత్రాల్లో సౌమిత్రా ఛటర్జీ నటించారు.

Read More:

టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టనున్న జవహర్ రెడ్డి

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,811 కొత్త కేసులు.. 9 మరణాలు