Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం యావత్ సినీ లోకాన్ని తీవ్రంగా కలిచి వేసింది. దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులతో పాటు సినిమా తారలు సైతం పునీత్ లేరన్న వార్తతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులో గుండెపోటుతో మరణించడంతో ఆయన అభిమానులు పునీత్ సమాధిని దర్శించుకుంటూ కంటతడి పెట్టుకుంటున్నారు. అయితే ఓవైపు పునీత్ రామ్‌కుమార్ లేరన్న వార్తను ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు జీర్ణించుకోవడానికి ఎంతో కష్టంగా ఉన్న ఇలాంటి సమయంలో.. కొందరు ప్రబుద్ధులు మాత్రం మరణాన్ని కూడా వ్యాపారానికి వాడుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తను బెంగళూరుకు చెందిన ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ తమ వ్యాపార ప్రచారానికి వాడుకుంది. పునీత్ రాజ్‌కుమార్ ఫోటోతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు కూడళ్ల వద్ద చేసింది. ఇందులో ఓవైపు ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూనే మరోవైపు తమ డయాగ్రోస్టిక్ సెంటర్ ప్రచారం చేసుకుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా అందరికీ గుండె, ఇతర చెకప్‌లు ఉచితంగా చేస్తామని ప్రకటించింది. అయితే ఉచిత సేవ అందిస్తోంది మంచి విషయమే కదా అనుకుంటే పొరపడినట్లే ఎందుకుంటే.. ఆ ఫ్లెక్సీపై ‘మా వద్ద బీపీ, ఈసీజీ, క్రెటిన్ లైన్, కొలస్ట్రాల్ చెకప్స్ చేయించుకుంటే కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే’ అంటూ ఓ ప్రకటన ఇచ్చింది.
ಎಲ್ಲದರಲ್ಲೂ ಲಾಭ ಹುಡುಕುವ ರಣಹದ್ದುಗಳು!! pic.twitter.com/g6JwxwTwMX
— ಮಂಜುನಾಥ್ ಜವರನಹಳ್ಳಿ (@manjujb1) November 2, 2021
దీంతో ఈ ఫ్లెక్సీ చూసిన పునీత్ రాజ్ కుమార్ అభిమానులు మండిపడుతున్నారు. ఓ అభిమాని ఈ ఫ్లెక్సీని ఫోటోను తీసి సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ పోస్టు చూసిన కొందరు నెటిజన్లు మరణ వార్తను ఇలా వాడుకుంటారా.? అంటూ సదరు నిర్వాహకులను తీవ్రంగా విమర్శిస్తున్నారు.
Viral Video: తుంటరి కోతి చేసిన పని చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.. వీడియో
Viral Video: తుంటరి కోతి చేసిన పని చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.. వీడియో