AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్రాంతికి సై అంటోన్న ఆ నలుగురు హీరోలు..!

ఈసారి టాలీవుడ్‌లో సంక్రాంతి ఫైట్ రంజుగా వుండబోతోంది. మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు ఇప్పటికే పొంగల్ రేసుకు సై చెప్పేశాయి. అయితే.. యుద్ధానికి మేమూ సిద్ధమంటూ తొడగొట్టేశారు బాలకృష్ణ, సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ నలుగురికీ మరో హీరో.. శర్వానంద్ కూడా తోడయ్యాడు. మరి.. సంక్రాంతి స్టంట్ చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవేమో..! మహేష్ బాబు.. ‘సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతి పోటీలో ఉండగా, రజనీకాంత్ ‘దర్బార్‌’తో వచ్చేస్తున్నాడు. ఇక నందమూరి బాలక్రిష్ణ, బన్నీ కూడా మరో […]

సంక్రాంతికి సై అంటోన్న ఆ నలుగురు హీరోలు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 03, 2019 | 11:30 AM

Share

ఈసారి టాలీవుడ్‌లో సంక్రాంతి ఫైట్ రంజుగా వుండబోతోంది. మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు ఇప్పటికే పొంగల్ రేసుకు సై చెప్పేశాయి. అయితే.. యుద్ధానికి మేమూ సిద్ధమంటూ తొడగొట్టేశారు బాలకృష్ణ, సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ నలుగురికీ మరో హీరో.. శర్వానంద్ కూడా తోడయ్యాడు. మరి.. సంక్రాంతి స్టంట్ చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవేమో..!

మహేష్ బాబు.. ‘సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతి పోటీలో ఉండగా, రజనీకాంత్ ‘దర్బార్‌’తో వచ్చేస్తున్నాడు. ఇక నందమూరి బాలక్రిష్ణ, బన్నీ కూడా మరో కొత్త సినిమాలతో పొంగల్ ఫెస్టివల్లో పాలు పంచుకోనున్నారు. నలుగురు పెద్ద తలకాయలు తలపడుతున్న ఈ బిగ్‌ఫైట్‌లో.. కుర్ర హీరో శర్వా కూడా తలదూర్చేశాడు. శతమానం భవతి, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో సక్సెస్‌లిచ్చిన శర్వానంద్.. ఇటీవల పడిపడి లేచె మనసుతో కాస్త డీలా పడ్డాడు. ఇప్పుడు సుధీర్ వర్మ డైరెక్షన్‌లో రణరంగం చేస్తున్నాడు. ఇందులో అతడిది గ్యాంగ్ స్టర్ పాత్ర.

ఇదిలా ఉంచితే.. శర్వా మరో సినిమా ‘శ్రీకారం’ అనే ఇంకో మూవీ స్టార్టయ్యింది. అతడి కెరీర్‌లో ఇది 29వ సినిమా. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్ మీద రానున్న శ్రీకారం సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. అయితే.. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి సై అంటున్నాయి. చూడాలి మరి.. వచ్చే ఏడాది సంక్రాంతి పురుషుడు ఎవరవుతారో..!

Follow Us