తనయుడి కోసం కథ సిద్ధం చేస్తోన్న బాలయ్య!

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షఙ్ఞ వెండితెర ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.

తనయుడి కోసం కథ సిద్ధం చేస్తోన్న బాలయ్య!

Mokshagna Tollywood Dubut: నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షఙ్ఞ వెండితెర ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. వారి కోరిక కచ్చితంగా నెరవేరుతుందని తన 60వ పుట్టినరోజు సందర్భంగా హామీ ఇచ్చిన బాలయ్య.. ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు తన కుమారుడి కోసం బాలయ్య ఓ కథను సిద్ధం చేస్తున్నట్లు ఫిలింనగర్‌ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అంతేకాదు అన్నీ కుదిరితే ఈ సినిమాను బాలయ్యనే డైరెక్ట్ చేయబోతారని కూడా సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే నందమూరి అభిమానులకు అదో పెద్ద పండుగ అవుతుంది.

కాగా మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో బాలయ్య మరోసారి ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీ తరువాత కేఎస్‌ రవికుమార్ దర్శకత్వంలో మూడోసారి బాలయ్య నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Read This Story Also: కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 983 కొత్త కేసులు.. 11 మరణాలు

 

Click on your DTH Provider to Add TV9 Telugu