Unstoppable with nbk 2: అన్‌స్టాపబుల్‌ 2లో పవన్‌ కళ్యాణ్‌.. బాలయ్య భలే హింట్‌ ఇచ్చారే..

|

Oct 17, 2022 | 7:00 AM

తనదైన మాస్‌ డైలాగ్‌లు, ఫైటింగ్‌లతో ప్రేక్షకులకు కట్టిపడేసే నట సింహం బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారిన షో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే'. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతోన్న ఈ షోకు ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తొలి సీజన్‌ను పూర్తి చేసుకున్న..

Unstoppable with nbk 2: అన్‌స్టాపబుల్‌ 2లో పవన్‌ కళ్యాణ్‌.. బాలయ్య భలే హింట్‌ ఇచ్చారే..
Unstoppable With Nbk 2
Follow us on

తనదైన మాస్‌ డైలాగ్‌లు, ఫైటింగ్‌లతో ప్రేక్షకులకు కట్టిపడేసే నట సింహం బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారిన షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతోన్న ఈ షోకు ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తొలి సీజన్‌ను పూర్తి చేసుకున్న ఈ టాక్‌ షో తాజాగా చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు అతిథులుగా రెండో సీజన్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. మరింత రెట్టించిన ఉత్సాహంతో మొదలైన ఈ షో ప్రేక్షకులను ఉర్రితలూగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోకి యంగ్‌ హీరోలు విశ్వక్‌ సేన్‌తో పాటు, సిద్ధు జొన్నలగడ్డ హాజరవుతున్నారు.

తాజాగా మేకర్స్‌ ఈ ఎపిసోడ్‌కి సంబంధించి టీజర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టీజర్‌ నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఇద్దరు కుర్ర హీరోలతో పోటీపడీ మరీ రచ్చ చేశారు బాలయ్య. ఈ క్రమంలోనే వీరిద్దరితో పాటు షోకు హాజరైన నిర్మాత సూర్య దేవర నాగవంశీ దర్శకుడు త్రివిక్రమ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సమయంలోనే ఫోన్‌ తీసుకున్న బాలయ్య మాట్లాడుతూ.. ‘త్రివిక్రమ్‌ షోకి ఎప్పుడొస్తున్నావ్‌’ అని అడగ్గా, దానికి త్రివిక్రమ్‌ బదులిస్తూ.. ‘మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తాను సార్‌’ చెప్పారు.

వెంటనే బదులిచ్చి బాలయ్య ‘షోకి ఎవరితో రావాలో తెలుసుగా’ అని అనగనే ప్రేక్షకులకు పెద్ద ఎత్తున క్లాప్స్‌ కొడుతూ హంగామా చేశారు. దీంతో ఆ ఎవరు, మరెవరో కాదు.. పవన్‌ కళ్యాణ్‌ అని ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. సహజంగా పవన్‌ టాక్ షోలలో పాల్గొన్నది లేదు. అయితే బాలయ్య అన్‌స్టాపబుల్‌కి హాజరైతే మాత్రం ఆయన ఫ్యాన్స్‌కి పండగ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇది నిజంగానే కార్యరూపం దాల్చుతుందో లేదో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..