అభిమానులకు బాలయ్య దీపావళి గిఫ్ట్.. ఏంటో తెలుసా..!

| Edited By: Anil kumar poka

Oct 24, 2019 | 7:53 PM

దీపావళి దగ్గరకొచ్చేస్తోంది. దీంతో అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు హీరోలు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ కూడా దీపావళికి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వబోతున్నారు. అదేంటంటే.. ప్రస్తుతం బాలయ్య.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 105వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ను అక్టోబర్ 26న మధ్యాహ్నం 2.50గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. కాగా ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, […]

అభిమానులకు బాలయ్య దీపావళి గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
Follow us on

దీపావళి దగ్గరకొచ్చేస్తోంది. దీంతో అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు హీరోలు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ కూడా దీపావళికి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వబోతున్నారు. అదేంటంటే.. ప్రస్తుతం బాలయ్య.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 105వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ను అక్టోబర్ 26న మధ్యాహ్నం 2.50గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. కాగా ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, భూమిక చావ్లా కీలక పాత్రలలో కనిపించనున్నారు. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా ఈ మూవీని డిసెంబర్ 20న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే ఈ ఏడాది మొదట్లో ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలకృష్ణ. ఈ రెండు భాగాలు అభిమానులను మెప్పించలేకపోయిన విషయం తెలిసిందే.