‘బాహుబలి’ రీమేక్‌.. రిస్క్ చేస్తున్నారా..?

| Edited By: Srinu

Jul 01, 2019 | 7:12 PM

భారత సినీ పరిశ్రమలో ‘బాహుబలి’కి ప్రత్యేక స్థానం ఉంది. జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ రెండు సిరీస్‌లు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఘన విజయాన్ని సాధించాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘బాహుబలి’ రికార్డులకెక్కింది. ఆ మూవీని మించేలా సినిమాలు తీయాలని బాలీవుడ్ దర్శకనిర్మాతలు సైతం ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఇంతవరకు ‘బాహుబలి’ని మించిన సినిమా రాలేదన్నది అందరూ ఎరిగిన సత్యం. ఇదంతా […]

‘బాహుబలి’ రీమేక్‌.. రిస్క్ చేస్తున్నారా..?
Follow us on

భారత సినీ పరిశ్రమలో ‘బాహుబలి’కి ప్రత్యేక స్థానం ఉంది. జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ రెండు సిరీస్‌లు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఘన విజయాన్ని సాధించాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘బాహుబలి’ రికార్డులకెక్కింది. ఆ మూవీని మించేలా సినిమాలు తీయాలని బాలీవుడ్ దర్శకనిర్మాతలు సైతం ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఇంతవరకు ‘బాహుబలి’ని మించిన సినిమా రాలేదన్నది అందరూ ఎరిగిన సత్యం. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు ఈ సినిమా రీమేక్‌ అవ్వబోతుంది. అవును మీరు చదువుతున్నది నిజమే. మన ‘బాహుబలి’ని రీమేక్ చేయబోతున్నారు. అది ఎక్కడో కాదండి మనదేశంలోనే. గుజరాతీ భాషలో ‘బాహుబలి’ రీమేక్ అవ్వబోతుంది.

ప్రముఖ యూట్యూబర్లు నితిన్ జానీ, తరుణ్ జానీ ఈ కళాఖండాన్ని రీమేక్ చేయబోతున్నారు. దీనిపై వారు మాట్లాడుతూ.. అవును గుజరాతీ భాషలో ఇక్కడి ప్రేక్షకులకు నచ్చేవిధంగా తాము బాహుబలిని రీమేక్ చేయబోతున్నాం అని తెలిపారు. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు మీరు న్యాయం చేయగలరా అన్న ప్రశ్నకు.. ‘‘జీవితంలో రిస్క్ చేయకపోతే ఫన్ ఉండదు. ఇప్పుడు మా రాష్ట్రప్రజల కోసం మేము బాహుబలిని రీమేక్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. దేశవ్యాప్తంగా పెద్ద హిట్ సాధించిన ఓ సినిమాను ఒక భాషలో రీమేక్ చేయడం.. అది కూడా గుజరాత్ వంటి చిన్న ఇండస్ట్రీలో చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్న పని అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి అంత పెద్ద ప్రాజెక్ట్‌కు నితిన్, తరుణ్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

కాగా ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, తమన్నా తదితరులు ప్రధాన పాత్రలలో బాహుబలి తెరకెక్కింది. ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే.