Vaishnavi Chaitanya: అవంటే నాకు చచ్చేంత పిచ్చి.. ఆసక్తికర విషయాలు పంచుకున్న ‘బేబీ’.

ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలతో బిజీగా ఉన్న వైష్ణవి కెరీర్‌పై దృష్టిసారించింది. ఇదిలా ఉంటే తాజగా వినాయక చవితి సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుందీ బ్యూటీ. హాఫ్‌ శారీస్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చిన ఈ చిన్నది, ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉన్నా ట్రెడిషనల్‌గా హాఫ్‌ శారీలు లేదా చీరలు ధరిస్తానని తెలిపింది...

Vaishnavi Chaitanya: అవంటే నాకు చచ్చేంత పిచ్చి.. ఆసక్తికర విషయాలు పంచుకున్న బేబీ.
Vaishnavi Chaitanya

Updated on: Sep 18, 2023 | 7:29 AM

వైష్ణవి చైతన్య.. ఈ పేరు టాలీవుడ్‌లో ఓ సంచలనం. వెబ్‌ సిరీస్‌లు, చిన్న చిన్న పాత్రలతో అడపాదడపా స్క్రీన్‌పై కనిపించిన వైష్ణవి.. బేబీ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. బేబీ సినిమా అఖండ విజయం సాధించడం, ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషిండంతో అందరి దృష్టి వైష్ణవిపై పడింది. ఒక్క సినిమాతో ఇండస్ట్రీని షేక్‌ చేసిందీ బ్యూటీ. ఓవైపు అందంతో, మరో వైపు నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఓవర్‌ నైట్‌లోనే స్టార్‌ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది.

ఇక ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలతో బిజీగా ఉన్న వైష్ణవి కెరీర్‌పై దృష్టిసారించింది. ఇదిలా ఉంటే తాజగా వినాయక చవితి సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుందీ బ్యూటీ. హాఫ్‌ శారీస్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చిన ఈ చిన్నది, ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉన్నా ట్రెడిషనల్‌గా హాఫ్‌ శారీలు లేదా చీరలు ధరిస్తానని తెలిపింది. అవంటే తనకు ప్రాణమని చెప్పుకొచ్చిన వైష్ణవి, జీన్స్‌ వేసుకోవడం చాలా తక్కువ అంది. ఇక ఒకవేళ ఎప్పుడైనా జీన్స్‌ వేసుకున్నా బొట్టు పెట్టుకోవడం మాత్రం మరువనని తెలిపింది. ఈ ఏడాది వినాయక చవితి తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చిన వైష్ణవి.. బీబీ సినిమా విజయవంతం కావడంతో ఎంతో మంది నుంచి అభినందనలు వచ్చాయి. మేము ఇంకా అదే సంతోషంలోనే ఉన్నాం, కాబట్టి ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చింది.

ఇక తెలుగమ్మాయిలకు సినిమా అవకాశాలు రావనే అంశంపై కూడా స్పందించింది వైష్ణవి. అసలు తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరనే మాట ఎలా వచ్చిందో తనకు తెలియదన్న ఈ చిన్నది, తాను మాత్రం సినిమాలపై ఇష్టం ప్రేమతో ప్రయత్నాలు చేశానని, అలాగే ఆడిషన్స్‌కి వెళ్లాలనని, నమ్మకం కోల్పోకుండా ప్రయత్నం చేయడం వల్లే అవకాశాలు వచ్చాయని చెప్పుకొచ్చింది. కేవలం యాక్టింగ్‌ మాత్రమే కాదని, ఏ కెరీర్‌ అయినా మనం కోరుకున్నది వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలని వైష్ణవి అభిప్రాయపడింది.

ఇక వైష్ణవి కేవలం నటనకు మాత్రమే పరిమితం కాదని తనలో మంచి డ్యాన్సర్‌ కూడా ఉందని చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు డ్యాన్స్‌ అంటే ఎంతో ఇష్టమన్న ఈ బ్యూటీ కూచిపూడి, వెస్ట్రన్‌ డ్యాన్స్‌ నేర్చుకున్నానని తెలిపింది. ఇక వైష్ణవి ప్రస్తుతం.. ఆశిష్‌కి జోడిగా ఒక సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు సిద్ధు జొన్నలగడ్డతో మరో చిత్రంలో నటించే ఛాన్స్‌ కొట్టేసిందీ చిన్నది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..