Taslima Nasreen: ప్రియాంక పై తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు.. సరోగేట్ పిల్లలను ‘రెడీమేడ్ బేబీస్’ అంటూ..

| Edited By: Anil kumar poka

Jan 23, 2022 | 9:25 AM

సరోగసీ విధానంలో తల్లిదండ్రులుగా మారిన గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా- నిక్ జొనాస్ దంపతులపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

Taslima Nasreen: ప్రియాంక పై తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు.. సరోగేట్ పిల్లలను రెడీమేడ్ బేబీస్ అంటూ..
Taslima Nasrin
Follow us on

సరోగసీ విధానంలో తల్లిదండ్రులుగా మారిన గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా- నిక్ జొనాస్ దంపతులపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సరోగసీ విధానంలో పిల్లల్ని కనడమనేది స్వార్థంతో కూడిన అహంకారమని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.  ఈ సందర్భంగా సరోగసీ విధానంలో పుట్టిన బిడ్డలను ‘రెడీమేడ్ బేబీస్ ‘ గా ఆమె అభివర్ణించారు. ఈ సందర్భంగా వరుసగా ట్వీట్లు చేశారు తస్టీమా.  ఇందులో ఆమె నేరుగా ప్రియాంక పేరు ప్రస్తావించకపోయినా.. ప్రియాంక దంపతులు సరోగసీ విధానంలో మొదటి బిడ్డను స్వాగతించాం అని ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే ఈ ట్వీట్లు పెట్టడం విశేషం.

అప్పటివరకు నేను సరోగసీని సమర్థించను!

‘ సమాజంలో నిరుపేద మహిళలు ఉన్నందునే సరోగసీ సాధ్యమవుతుంది. శ్రీమంతులు  తమ స్వ ప్రయోజనాల కోసం సమాజంలో ఎల్లప్పుడూ పేదరికం ఉండాలని కోరుకుంటారు. మీరు ఒక బిడ్డను పెంచుకోవాలనుకుంటే, అనాథ బిడ్డను దత్తత తీసుకోండి.   సరోగసీతో పిల్లల్ని కనడమనేది స్వార్థంతో కూడిన అహంకారం. పిల్లలు తల్లిదండ్రుల లక్షణాలను వారసత్వంగా పొందాలి. మరి ఇలా రెడీమేడ్ బిడ్డలను కన్నప్పుడు అదెలా సాధ్యమవుతుంది? ధనవంతులైన మహిళలు సరోగేట్ మదర్ గా మారేవరకు నేను సరోగసీని సమర్థించను. అదేవిధంగా పురుషులు ఇష్టంగా బుర్ఖా ధరించేవారికి నేను దానిని అంగీకరించను.  వ్యభిచార గృహాల్లోని పురుషులు మహిళా కస్టమర్ల కోసం ఎదురుచూసేంతవరకు నేను దానిని సమర్థించను. సరోగసి, బుర్ఖా, వ్యభిచారం.. ఇవన్నీ నిరుపేద మహిళలను దోపిడీ చేయడానికే’ అంటూ ఆమె రాసుకొచ్చారు.

అనారోగ్యకారణాలు కూడా ఉంటాయి.. కదా!

ప్రస్తుతం తస్లీమా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నెటిజన్లు కూడా భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ‘చాలామంది అనారోగ్య కారణాలతో సరోగసీని ఎంచుకుంటున్నారని, తల్లిదండ్రులుగా ఎలా మారాలో నిర్ణయించుకోవడం వారి వ్యక్తిగత హక్కు అని నస్రీన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.  భారతదేశంతో పాటు చాలా దేశాల్లో కమర్షియల్ సరోగసీని నిషేధించారని మరికొందరు ఆమెకు గుర్తుచేశారు. రెడీమేడ్ బేబీస్ అన్న వ్యాఖ్యలు సమర్థనీయం కాదని ఇంకొందరు చెప్పుకొచ్చారు. కాగా తస్లీమా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ పలు సున్నితమైన అంశాలపై  కామెంట్లు చేసి విమర్శలు ఎదుర్కొన్నారామె.

Also Read: Coronavirus: తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో కరోనా కలకలం.. భారీగా వెలుగు చూసిన పాజిటివ్ కేసులు..

Pregnency Care: గర్భిణీలు నవ్వడం మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

Pregnency Care: గర్భిణీలు నవ్వడం మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారు..