మలయాళ క్రేజీ హీరోయిన్ మంజు వారియర్ (Manju Warrier) టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆమె నటించిన లూసీఫర్, ఓడియన్, మరక్కార్, ద ప్రీస్ట్, చతుర్ముఖం, అసురన్ వంటి డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నాయి. 1995 వెండితెరకు పరిచయమైన ఈ 43 ఏళ్ల సీనియర్ నటికి మలయాళంలో ఇప్పుడు కూడా సూపర్బ్ క్రేజ్ ఉంది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగా, ప్లే బ్యాక్ సింగర్‌గా మలయాళీ ప్రేక్షకుల్లో బాగా పాపులారిటీ సంపాదించారామె. కాగా మంజు 2020లో కయాట్టం అనే సినిమాలో నటించింది. దీనికి సనల్ కుమార్ శశిధరన్ (Sanal Kumar Sasidharan )దర్శకుడిగా వ్యవహరించారు. అయితే సినిమా షూటింగ్‌లో సమయంలోనే ఆమెకు అదే పనిగా మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు గురిచేశాడు సనల్ కుమార్. సినిమా షూటింగ్ పూర్తయ్యాక కూడా ఈ తంతు కొనసాగించాడు. దీంతో అతనికి ఒకసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చిందామె. ఆ తర్వాత అతని నంబర్ ని కూడా బ్లాక్ చేసింది. అయితే అతను మాత్రం తన వికృత చర్యలు ఆపలేదు. సోషల్ మీడియాలో కూడా సందేశాలు పంపుతూ ఇబ్బందులకు గురిచేశాడు. ఈక్రమంలో అతడి వేధింపులు భరించలేక మంజు వారియర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మఫ్టీలో వెళ్లి..
ఈక్రమంలో వేధింపులకు గురి చేసిన కేసులో డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువనంతపురంలో ఉన్న సనల్ కుమార్ ఇంటికి మఫ్టీలో వెళ్లిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కొచ్చికి తరలించారు. కాగా ప్రస్తుతం ఈ వార్త మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. కేరళ ప్రభుత్వం నుంచి సనల్ కుమార్ పలు అవార్డులు కూడా తీసుకున్నాడు. అలాంటి డైరెక్టర్ ఇలాంటి నీచమైన పనులు చేయడం ఏంటని నెటిజన్లు సనల్‌కుమార్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: