Aravind Swami Daughter: అరవింద్ స్వామి ఇరవై ఏళ్ల క్రితం మణిరత్నం దళపతి సినిమాలో రజనీకాంత్ తమ్ముడిగా కలెక్టర్ గా ఓ చిన్న పాత్రలో కనిపించి తన అందంతో అందరినీ ఆకట్టుకున్నాడు. రజనీకాంత్, మమ్ముట్టి లతో పాటు ఆ సినిమాలో అరవింద్ కూడా నటించాడు అని అందరూ చెప్పుకునేటంతగా ఆ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రోజా సినిమాతో దేశ వ్యాప్తంగా ప్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చెట్టుకున్న అరవింద్ బొంబాయి తో క్రేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత సరైన హిట్స్ లేక పోవడంతో వెండి తెరకు గుడ్ బై చెప్పి.. తన బిజినెస్ తో బిజీఅయ్యాడు.
చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మణిరత్నం సినిమా కడలి తో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. వరస సినిమా ఆఫర్స్ తో కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్ లో దూసుకెళ్తున్నారు అరవింద్ స్వామి.. ముఖ్యంగా తమిళంలో మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ‘తని ఒరువన్’, దాని తెలుగు రీమేక్ ‘ధృవ’ సినిమాల్లో చేసిన స్టైలిష్ విలన్ రోల్‌తో తన నటనలోని మరో యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అరవింద్ స్వామి ప్రస్తుతం దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’లో ఎం.జి. రామచంద్రన్ పాత్రను పోషిస్తున్నాడు. టైటిల్ రోల్‌ను కంగనా రనౌత్ చేస్తున్న ఈ మూవీకి ఎ.ఎల్. విజయ్ దర్శకుడు.
తాజాగా ఆయన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ ఫొటోలో అరవింద్ సైకిల్ తొక్కుతుంటే, సైకిల్‌పై ఆయన ముందు ఓ అమ్మాయి కూర్చొని పెద్దగా నవ్వులు చిందిస్తూ ఉంది. అరవింద్ ముఖంపై కూడా నవ్వు కనిపిస్తోంది. ఆమె అరవింద్ స్వామి కూతురు అధిర స్వామి. దాంతో ఆయనకు ఇంత పెద్ద కూతురు ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ పిక్చర్‌ను అరవింద్ స్వామి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసి, “Bicycle thieves!” అని క్యాప్షన్ పెట్టాడు.
Also Read: భారత్ లో కరోనా నివారణకు మోడెర్నా టీకా క్లినికల్ ట్రయల్స్ కు టాటా ప్రయత్నాలు..: