Pawan kalyan Movie Update: పవన్ సినిమాలో బాలీవుడ్ స్టార్.. ఆ క్రేజీ కాంబినేషన్‏లో కీలక పాత్ర..

|

Feb 07, 2021 | 2:44 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చాక ఫుల్ జోష్ మీద దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 'వకీల్ సాబ్' చిత్రాన్ని పూర్తిచేసిన పవన్.. మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం వపన్, క్రిష్

Pawan kalyan Movie Update: పవన్ సినిమాలో బాలీవుడ్ స్టార్.. ఆ క్రేజీ కాంబినేషన్‏లో కీలక పాత్ర..
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చాక ఫుల్ జోష్ మీద దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని పూర్తిచేసిన పవన్.. మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం వపన్, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్‏లో పాల్గొంటున్నాడు. జానపద పీరియాడిక్ కథగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి మరో గాసిప్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.

పవన్, క్రిష్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుట్ స్టార్ అర్జుజన్ రాంపాల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. జానపద పీరియడిక్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ మోఘల్ రాజు ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నారట. ఈ చిత్రాన్ని వీలైనంత తొందరగా పూర్తిచేసి.. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఇక పవన్ ఈ సినిమాతోపాటు అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా మరో హీరోగా నటిస్తున్నాడు.

Also Read: పవన్ కళ్యాణ్ పర్మిషన్ తోనే ఆ సినిమా చేశా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన డైరెక్టర్ క్రిష్