తెలుగు హీరోయిన్ అనుష్క పశ్చిమ గోదావరి పోలవరం మధ్యలో ఉన్న మహా నందీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్నేహితులతో కలిసి ఆమె పడవలో ప్రయాణించి ఆలయానికి చేరుకున్నారు. తన కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే అనుష్క ఆ సమయంలో మాస్కు ధరించడంతో ఎవరూ ఆమెను గుర్తు పట్టలేదు…
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన అనుష్క చాలా నిరాడంబరంగా కనిపించారు. సినీ పరిశ్రమలోని స్నేహితులతో కలిసి వచ్చిన చాలా సింపుల్‌గా కనిపించారు. కాగా, అనుష్క గతంలోనూ తిరుపతి దేవాలయానికి పలుమార్లు వచ్చారు. అనుష్కకు దైవభక్తి ఎక్కువగానే ఉంది. అనుష్క ఇటీవల నిశ్శబ్దం సినిమాలో నటించారు. ఆ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. అయితే అనుష్క ఇప్పటి వరకు మరే కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు.