‘మహా సముద్రం’లో మరో హీరోయిన్ ఎవరంటే..!

| Edited By:

Oct 17, 2020 | 12:14 PM

శర్వానంద్‌, సిద్ధార్థ్‌లు హీరోలుగా ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం మహా సముద్రం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న

మహా సముద్రంలో మరో హీరోయిన్ ఎవరంటే..!
Follow us on

Sharwanand Maha Samudram: శర్వానంద్‌, సిద్ధార్థ్‌లు హీరోలుగా ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం మహా సముద్రం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఓ హీరోయిన్‌గా అదితీ రావు హైదరీ కన్ఫర్మ్ అయ్యారు. ఇక ఇందులో మరో హీరోయిన్ కూడా ఉండగా.. అందుకోసం పలువురి పేర్లు వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా మరో భామ పేరు వెలుగులోకి వచ్చింది. మలయాళ బ్యూటీ అను ఇమ్మాన్యుల్‌లో మహా సముద్రంలో రెండో హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ మూవీకి సంబంధించిన నటీనటుల వివరాలను ఒక్కొక్కరిగా రివీల్ చేస్తోన్న టీమ్‌.. త్వరలోనే అను పేరును ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా అనిల్‌ సుంకర మహా సముద్రంను నిర్మిస్తుండగా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో విలక్షణ నటుడు జగపతి బాబు కూడా భాగం కాబోతున్నట్లు సమాచారం.

Read More:

ప్రభాస్ ఫ్యాన్స్‌కి ‘రాధేశ్యామ్’‌ టీమ్‌ బర్త్‌డే కానుక.. ఏంటో తెలుసా..!

విజయ్‌కి మద్దతిస్తూ.. విమర్శకులకు రాధిక స్ట్రాంగ్‌ కౌంటర్‌