Breaking News
  • అమరావతి: ఏపీ జర్నలిస్ట్‌ అక్రిడేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ. 2 వారాల్లో అక్రిడేషన్ల పునరుద్ధరణ చేయాలని ఆదేశం. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలన్న హైకోర్టు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా .
  • రేపు వరద ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన. ఉ.9కు తార్నాకలోని మణికేశ్వర్‌నగర్‌లో పర్యటించనున్న కిషన్‌రెడ్డి . అనంతరం మెట్టుగూడ, అంకమ్మ బస్తీ, శ్యామలకుంట, ఓల్డ్‌ప్రేమ్‌నగర్‌.. నరేంద్రనగర్‌లోని ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న కేంద్రమంత్రి. సా.5గంటలకు జీడిమెట్ల ఫాక్స్‌ సాగర్‌ చెరువు పరిశీలన.
  • అనంతపురం: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసు. కర్నాటక లోకాయుక్తలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి. వాహనాల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో.. కర్నాటక అధికారులపై ఫిర్యాదు చేసినప్పుడు ఏపీలో ఎందుకు చేయలేదని ప్రశ్న . చట్టం మీ చేతుల్లో ఉందని మమ్మల్ని అక్రమంగా అరెస్ట్‌ చేస్తారా. బీఎస్‌3 కన్నా ముందున్న వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పనిచేయడం లేదు. చట్టం తమ చేతుల్లో ఉందని ఇష్టమొచ్చినట్టు కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా మరోసారి జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధం-తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి.
  • విజయవాడ: దుర్గగుడి అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి వెల్లంపల్లి, దేవాలయాల అభివృద్ధి పట్ల సీఎం జగన్‌ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం-వెల్లంపల్లి.
  • హైదరబాద్: వరదల్లో ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ, డూప్లికేట్‌ మెమోరాండం ఆఫ్‌ మార్క్స్‌ కోసం వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు-ఇంటర్మీడియట్‌ బోర్డ్‌, సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌.
  • అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణించి వాయుగుండంగా మారే అవకాశం. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం . రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు. -అమరావతి వాతావరణ కేంద్రం.
  • తుళ్లూరు రిటైర్డ్‌ తహశీల్దార్‌ సుధీర్‌బాబు క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత. రాజధాని అసైన్డ్‌ భూముల కుంభకోణంలో సుధీర్‌బాబుపై సీఐడీ కేసు. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని ఏపీ హైకోర్టులో సుధీర్‌బాబు పిటిషన్‌. సుధీర్‌బాబుతో పాటు విజయవాడకు చెందిన సురేష్‌ అరెస్ట్‌.

ప్రభాస్ ఫ్యాన్స్‌కి ‘రాధేశ్యామ్’‌ టీమ్‌ బర్త్‌డే కానుక.. ఏంటో తెలుసా..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కి అక్టోబర్ నెల అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ప్రభాస్ పుట్టింది ఈ నెలలోనే కాబట్టి. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కాగా..

Prabhas Radhe Shyam, ప్రభాస్ ఫ్యాన్స్‌కి ‘రాధేశ్యామ్’‌ టీమ్‌ బర్త్‌డే కానుక.. ఏంటో తెలుసా..!

Prabhas Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‌కి అక్టోబర్ నెల అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ప్రభాస్ పుట్టింది ఈ నెలలోనే కాబట్టి. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కాగా.. ఆ రోజు ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. ఇదిలా ఉంటే ఈ పుట్టినరోజు సందర్భంగా రెబల్‌స్టార్ ఫ్యాన్స్‌కి పలువురు దర్శకనిర్మాతలు కానుకలను ఇవ్వబోతున్నారు. అందులో భాగంగా మొదటి కానుకను దర్శకుడు రాధాకృష్ణకుమార్ ప్రకటించారు.

ప్రభాస్‌తో రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తోన్న రాధే శ్యామ్ నుంచి మోషన్‌ పోస్టర్‌ అక్టోబర్ 23న విడుదల కానుంది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో బీట్స్‌ ఆఫ్ రాధే శ్యామ్ అన్న హ్యాష్‌ట్యాగ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. కాగా పీరియాడిక్ ప్రేమకథగా రాధే శ్యామ్ తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, టీసిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More:

విజయ్‌కి మద్దతిస్తూ.. విమర్శకులకు రాధిక స్ట్రాంగ్‌ కౌంటర్‌

కీర్తి సురేష్‌ బర్త్‌డే.. మహేష్ బాబు స్పెషల్ విషెస్

Related Tags