సల్మాన్‌ సెట్‌లో అపశ్రుతి.. స్థానికుల ఆగ్రహం

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం ‘దబాంగ్ 3’. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని అహల్య కోటలో జరుగుతోంది. అయితే ఈ షూటింగ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. షూటింగ్ కోసం సామాన్లు తరలిస్తోన్న సమయంలో ప్రమాదవశాత్తు కోటలోని ఓ పురాతన విగ్రహం ధ్వంసమైంది. తాళ్ల సాయంతో షూటింగ్‌కు సంబంధించిన వస్తువులు పైకి లాగుతుండగా.. అవి విగ్రహానికి తగిలి చేయి విరిగిపోయింది. […]

సల్మాన్‌ సెట్‌లో అపశ్రుతి.. స్థానికుల ఆగ్రహం

Edited By:

Updated on: Apr 08, 2019 | 1:41 PM

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం ‘దబాంగ్ 3’. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని అహల్య కోటలో జరుగుతోంది. అయితే ఈ షూటింగ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది.

షూటింగ్ కోసం సామాన్లు తరలిస్తోన్న సమయంలో ప్రమాదవశాత్తు కోటలోని ఓ పురాతన విగ్రహం ధ్వంసమైంది. తాళ్ల సాయంతో షూటింగ్‌కు సంబంధించిన వస్తువులు పైకి లాగుతుండగా.. అవి విగ్రహానికి తగిలి చేయి విరిగిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు విగ్రహం ధ్వంసం కావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల కూడా ఈ సినిమా షూటింగ్ వార్తల్లో నిలిచింది. షూటింగ్‌ కోసం భాగంగా ఓ పురాతన శివలింగాన్ని కప్పివేసింది చిత్ర యూనిట్. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై పలువురు నెటిజన్లు విమర్శలు కురిపించగా.. వాటిపై చిత్ర యూనిట్ స్పందించింది. శివలింగానికి ఏమీ కాకుడదనే అలా కప్పామని వారు వెల్లడించిన విషయం తెలిసిందే.