యాంకర్‌గానే కాకుండా అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. బుల్లితెరతోపాటు, వెండితెరపై కూడా తన విభిన్న పాత్రల్లో తన టాలెంట్ చూపిస్తుంది ఈ జబర్ధస్త్ బ్యూటీ. సోషల్ మీడియాలో అనసూయ ఎప్పుడు యాక్టీ్వ్గానే ఉంటుంది. అయితే ఆమె చేసే కొన్ని పోస్టులను కొందరు ట్రోల్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వీటిని పట్టించుకోకున్న.. మరికొన్ని సందర్భాల్లో అనసూయ తనదైన స్టైల్లో వారికి సమాధానాలు ఇస్తుంటుంది. తాజాగా మరోసారి తనను ట్రోల్ చేసిన నెటిజన్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది ఈ అమ్మడు.
తాజాగా ఓ నెటిజన్ అనసూయ మూడేళ్ళ కిందటి ఫోటోను షేర్ చేస్తూ.. ఆమెను ఇష్టానుసారంగా దూషించాడు. అనసూయ అందరి అటెన్షన్ కోసం ఇలా చేస్తుందంటూ ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ పై అనసూయ స్పందించింది. ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఈ వీడియోను ఇప్పుడు తీసి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత నాకు లో బీపీ వచ్చింది. ఈ సంఘటన ఉదయం 5.30 గంటల ప్రాంతంలో జరిగింది. 22 గంటలు విరామం లేకుండా పనిచేయడం వలన నాకు కళ్లు తిరిగాయి. అంతేకానీ నువ్వు చెప్పిన కారణాలు ఏమి నిజంకావు. పూర్తిగా తెలుసుకోకుండా ఇలాంటి కామెంట్స్ చేయకు అంటూ నెటిజన్‌కు గట్టిగానే బదులిచ్చింది అనసూయ.
Its easy to comment isn’t it? Having punched out two babies and in the process developed low blood pressure and this particular “attention seeking” incident took place at 5:30am where we shot straight for 22 hours.. what exactly do you know to even notice Mr.Aditya..?? https://t.co/FyrR4CW9Ou
— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 7, 2021
Also Read:
Jathiya Rahadari Movie Update: ఫిల్మ్ ఫేర్ అవార్డులకు నామినేట్ అయిన ‘జాతీయ రహదారి’..