మాస్ ఇంత బాగా రాయగలవనుకోలేదు.. స్టార్ హీరో ఫోన్ చేసి మాస్ ఇంత బాగా రాయగలవనుకోలేదు అన్నారు : అనంత శ్రీరామ్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ లిరిసిస్ట్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అనంత్ శ్రీరామ్ .. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరీర్ మలుపు తిప్పిన పాటలు చాలానే ఉన్నాయని గతంలో పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు .

ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన అనేక ఆసక్తికర విషయాలను, తన వ్యక్తిగత అభిప్రాయాలను ఇటీవల పంచుకున్నారు. పని పట్ల తన నిబద్ధతను, ఇతర గేయ రచయితల పట్ల తన గౌరవాన్ని, స్టార్ హీరోల నుండి లభించిన ప్రశంసలను వివరించారు. రెమ్యూనరేషన్ విషయంలో తాను చాలా నిక్కచ్చిగా ఉంటానని అనంత శ్రీరామ్ స్పష్టం చేశారు. పాట రాయడానికి ముందే రెమ్యూనరేషన్ తీసుకుంటానని, ఒకవేళ దర్శకుడు లేదా సంగీత దర్శకుడు పది వెర్షన్లు మార్పించినా, పదకొండో వెర్షన్ అడిగినా, తన శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది కాబట్టి డబ్బులు వెనక్కి ఇచ్చే ప్రసక్తే ఉండదని తెలిపారు. ఒకవేళ తన పని నచ్చకపోతే, అది తన తప్పు కాదని, ఇప్పటివరకు అలా జరగలేదని, తాను రాసిన పాటలు అందరికీ నచ్చడం సంతోషంగా ఉందని చెప్పారు.
ఒకప్పుడు టీవీ యాంకర్.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోప్ హీరోయిన్.. హీరోలకు మించి క్రేజ్
స్టార్ హీరోల ప్రశంసల గురించి ప్రస్తావిస్తూ.., రామ్ చరణ్ మస్సా మస్సా పాటకు ఎంతగానో స్పందించి తనను ఆలింగనం చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ బృందావనం చిత్రంలోని చిన్నదో వైపు, పెద్దదో వైపు పాట విన్న తర్వాత, వంశీ పైడిపల్లి గారి ద్వారా ఫోన్ చేయించి, “మాస్ ఇంత బాగా రాయగలవని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు” అంటూ ప్రశంసించారని తెలిపారు. మాటల్లో కాకుండా ఇలాంటి ప్రశంసలు చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
చిరు, బాలయ్యల, నాగ్, వెంకీలతో బ్లాక్ బస్టర్స్.. కట్ చేస్తే సినిమాలకు దూరం.. ఇప్పుడు ఇలా
అలాగే తన కెరీర్ ఫిలాసఫీ గురించి మాట్లాడుతూ.., సినీ పరిశ్రమలో వ్యక్తిగత సంబంధాలు, పీఆర్లు కెరీర్‌కు ముఖ్యం కావని అనంత శ్రీరామ్ అన్నారు. తన పెళ్లికి ఎవరినీ పిలవలేదని, కానీ తన కెరీర్ ఆగలేదని ఉదాహరణగా చెప్పారు. మనం వ్యక్తిగతంగా ఎలా ఉన్నాం, ఎలాంటి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం అనేదాని బట్టి కెరీర్ ఉండదని, మనం రాసే పాటలు, కథలు, మాటలు ప్రజారంజకంగా, జనరంజకంగా ఉండి, విజయాలు తెచ్చిపెడుతుంటేనే మన పని నిలబడుతుందని ఆయన గట్టిగా చెప్పారు. పని లేని రోజున గౌరవంగా తప్పుకోవడమే సరైన మార్గం అని ఆయన తన దృక్పథాన్ని స్పష్టం చేశారు.
Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




