బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌కు కరోనా పాజిటివ్.. తనతో టచ్‌లో ఉన్నవారు కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని హితవు..

anand l rai tests positive for corona: కరోనా మహమ్మారి సాధారణ పౌరుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరిని విడిచిపెట్టడం లేదు. ఈ సంవత్సరం

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌కు కరోనా పాజిటివ్.. తనతో టచ్‌లో ఉన్నవారు కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని హితవు..

Updated on: Dec 31, 2020 | 12:34 PM

anand l rai tests positive for corona: కరోనా మహమ్మారి సాధారణ పౌరుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరిని విడిచిపెట్టడం లేదు. ఈ సంవత్సరం వైరస్ సోకి చాలామంది ప్రముఖులు మృతిచెందారు. అందులో సినీ తారలు, రాజకీయ నాయకులు, వ్యాపారులు, అధికారులు తదితరులు ఉన్నారు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్‌ తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించారు.

కానీ ఎలాంటి లక్షణాలు లేవని బాగానే ఉన్నానని తెలిపారు. అధికారుల సూచన మేరకు క్వారెంటైన్‌లో ఉన్నానన్నారు. కాగా ఆయన ప్రస్తుతం అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీ ఖాన్ లీడ్ రోల్స్‌లో ‘అత్రంగి రే’ సినిమా చేస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తుండగా.. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రీసెంట్‌గా తనతో టచ్‌లో ఉన్నవారు దయచేసి కొవిడ్ టెస్ట్ చేయించుకుని, సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉండాలని కోరారు. గవర్నమెంట్ ప్రొటోకాల్స్ తప్పకుండా పాటించాలన్నారు.