వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో.. మరో డైరెక్టర్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ..

|

Feb 07, 2021 | 7:31 PM

'దొరసాని' సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోగా పరిచయమయ్యాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించినంతగా విజయం సాధించలేకపోయింది.

వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో.. మరో డైరెక్టర్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ..
Follow us on

Anand Devarakonda: ‘దొరసాని’ సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోగా పరిచయమయ్యాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించినంతగా విజయం సాధించలేకపోయింది. ఇటీవల వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలోడిస్’ మూవీతో హిట్ కొట్టాడు ఈ యంగ్ హీరో. భావోద్వేగమైన ప్రేమ కథలతో వచ్చిన ఈ సినిమా.. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ మీద సూపర్ హిట్ సాధించింది. ఈ మూవీ హిట్‏తో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు ఆనంద్.

తాజాగా ఈ యంగ్ హీరో.. అవినాష్ కోకాటి అనే కొత్త దర్శకుడు చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అంతేకాకుండా.. కాన్సెప్ట్ బేస్డ్ కథ కావడంతో ఈ మూవీ గురించి ఆనంద్ చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా టాక్. ఈ సినిమా మార్చి నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతో విభిన్న కథాంశాలకు ఆనంద్ ఓకే చెప్తున్నాడు. మరీ చూడాలి ఆనంద్ కూడా తన అన్నయ్యలాగా స్టార్ హీరో రేసులో వెళ్తాడా? లేదా? అనేది.

Also Read:

Rhea Chakraborty : రియా చక్రవర్తితో టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సంప్రదింపులు.. త్వరలో తెలుగులో సినిమా..?