ముంబయి: అందాల నటి అమీ జాక్సన్ తల్లి కాబోతున్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో అమీ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. న్యూఇయర్ సందర్భంగా జాంబియాలో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ నేపథ్యంలో తాను తల్లి కాబోతున్నట్లు అమీ సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నానని, అక్టోబర్ నెలలో మొదటి బిడ్డ పుట్టునుందని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపింది అమీ. ఈ సందర్భంగా కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. తెలుగులో ‘ఎవడు’, ‘అభినేత్రి’ చిత్రాల్లో నటించారు అమీ. ఇటీవల విడుదలైన శంకర్ తీసిన ‘2.ఓ’ చిత్రం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.