ఆ ఇద్దరితో నా సినిమా ఆగిపోయింది.. ‘ప్రేమమ్’ దర్శకుడు క్లారిటీ..!

ప్రేమమ్‌.. ఈ అద్భుత దృశ్యకావ్యంను సినీ ప్రేక్షకులెవ్వరు అంత ఈజీగా మర్చిపోరు. మలయాళంలో వచ్చిన ఈ చిత్రం అక్కడ భారీ విజయాన్ని సాధించగా..

ఆ ఇద్దరితో నా సినిమా ఆగిపోయింది.. ప్రేమమ్ దర్శకుడు క్లారిటీ..!

Edited By:

Updated on: Jun 01, 2020 | 6:14 PM

ప్రేమమ్‌.. ఈ అద్భుత దృశ్యకావ్యంను సినీ ప్రేక్షకులెవ్వరు అంత ఈజీగా మర్చిపోరు. మలయాళంలో వచ్చిన ఈ చిత్రం అక్కడ భారీ విజయాన్ని సాధించగా.. సబ్‌టైటిల్స్‌ పెట్టుకొని మరీ చూశారు మిగిలిన భాషల సినీ ప్రేమికులు. ఇక ఈ మూవీతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు దర్శకుడు ఆల్ఫోన్స్‌ పుత్రేన్. ఈ సినిమా వచ్చి ఇప్పటికీ 5 సంత్సరాలు పూర్తి అయ్యింది. అయితే ఇంతవరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు ఈ దర్శకుడు. కాగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, తమిళ యంగ్ నటుడు అరుణ్ విజయ్‌లతో ఆల్ఫోన్స్‌ ఓ ద్విభాష చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఆ వార్తలపై క్లారిటీని ఇచ్చారు ఈ దర్శకుడు.

మమ్ముట్టి, అరుణ్‌ విజయ్‌లతో తాను తెరకెక్కించాలనుకున్న సినిమా ఆగిపోయిందని ఆల్ఫోన్స్ అన్నారు. ఈ సినిమాకు బడ్జెట్ సమస్యలతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఆయన స్పష్టతను ఇచ్చారు. ఇక తన నెక్ట్స్ మూవీని సంగీతం కథా నేపథ్యంగా తెరకెక్కించాలనుకుంటున్నానని.. ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రిప్ట్‌ పని జరుగుతుందని వివరించారు. అంతేకాదు ఈ సినిమా కోసం కర్ణాటక సంగీతాన్ని కూడా నేర్చుకున్నానని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రేమమ్‌ సినిమాను హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఈ రీమేక్‌కి కూడా ఆల్ఫోన్స్‌ దర్శకత్వం వహించబోతున్నట్లు అప్పట్లో టాక్ నడిచింది. అయితే ప్రేమమ్‌ రీమేక్‌కు దర్శకత్వం వహించే ఆలోచన లేదని, కానీ ఈ సినిమాకు తానొక నిర్మాతగా వ్యవహరిస్తున్నానని ఆయన అన్నారు. కరణ్ జోహార్‌ నిర్మించబోతున్న ప్రేమమ్‌ రీమేక్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటించబోతున్నారు. కాగా ఇప్పటికే ప్రేమమ్‌ తెలుగులో రీమేక్‌ కాగా.. అందులో నాగ చైతన్య నటించిన విషయం తెలిసిందే.

Read This Story Also: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన.. కీలక తప్పిదాలు బయటపెట్టిక కమిటీ..!