AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జిమ్‌లో అదరగొట్టిన ఊర్వశీ రౌతేలా

సినిమా షూటింగ్‌లకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో బాలీవుడ్ సినీ ప్రపంచం రెడ్ కార్పేట్ మీదికి వచ్చేసింది. ఇంతకాలం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన హీరోయిన్లు ‘వంటావార్పు’తో సోషల్ మీడియాలో కనిపించారు. రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వటంతో సోషల్‌మీడియాలో తమ స్టైల్‌నుమార్చారు. ఇంతకాలం తాము ఎలా వర్కౌట్‌ చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. నిన్నటికి నిన్న పూజా హెగ్డే అదిరిపోయే భంగిమలతో ఆకట్టుకుంటే … అదేబాటలో మరో బాలీవుడ్ భామ ‘సారా కా సారా’ టు […]

జిమ్‌లో అదరగొట్టిన ఊర్వశీ రౌతేలా
Sanjay Kasula
|

Updated on: Jun 01, 2020 | 4:38 PM

Share

సినిమా షూటింగ్‌లకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో బాలీవుడ్ సినీ ప్రపంచం రెడ్ కార్పేట్ మీదికి వచ్చేసింది. ఇంతకాలం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన హీరోయిన్లు ‘వంటావార్పు’తో సోషల్ మీడియాలో కనిపించారు. రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వటంతో సోషల్‌మీడియాలో తమ స్టైల్‌నుమార్చారు. ఇంతకాలం తాము ఎలా వర్కౌట్‌ చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

నిన్నటికి నిన్న పూజా హెగ్డే అదిరిపోయే భంగిమలతో ఆకట్టుకుంటే … అదేబాటలో మరో బాలీవుడ్ భామ ‘సారా కా సారా’ టు ‘సారా కా ఆదా’ అంటూ పోస్ట్ పెట్టింది. ఇప్పుడు తాజాగా… బికినీ భామ ఊర్వశీ రౌతేలా లాక్‌డౌన్‌ సమయంలో తాను జిమ్‌లో ఎంతలా కష్టపడింది.. ఎలా వర్కౌట్లు చేసిందో ఇన్‌స్టా ఎకౌంట్‌లో పోస్ట్ చేసింది.

అయితే కరోనా సమయంలో మాత్రం పెద్ద మనసును చాటుకుంది. లాక్‌డౌన్‌ పీరియడ్‌లో బరువు తగ్గడానికి, డాన్స్ నేర్చుకోవాలనేకునే వారందరికీ ఉచితంగా టిక్‌టాక్‌లో అభిమానుల కోసం స్పెషల్ సెషన్ క్రియేట్ చేసింది. ఇక టిక్‌టాక్‌లో ఆమె డాన్స్ మాస్టర్ క్లాస్‌ను దాదాపు 18 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో టిక్‌టాక్ ఆమెకు రూ. 5 కోట్ల పారితోషకాన్ని అందజేసింది. ఈ మొత్తాన్ని కరోనా సహాయ నిధికి అందించింది. ఊర్వశీ రౌతేలా .. సక్సెస్ కోసం చూస్తోంది. ‘సనమ్ రే’ ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ ‘హేట్ స్టోరీ 4’ లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ సినిమాల్లో అందాలను ఎంత ఆరబోసినా కూడా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ తన అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ వీడియోను పోస్ట్ చేసింది.