
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలకే కాదు.. ఆ మూవీ టైటిళ్లకు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలో అప్పుడెప్పుడో చిరు నటించిన సినిమాల టైటిళ్లను ఇప్పటి హీరోలు వాడుకుంటున్నారు. తెలుగు హీరోలే కాదు తమిళ హీరోలు సైతం తమ డబ్బింగ్ చిత్రాలకు చిరు టైటిళ్లను వాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సైతం చిరు మూవీ టైటిల్‌ను వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.
తనకు చెందిన ఆన్‌లైన్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’ కోసం పలు వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నారు అల్లు అరవింద్. ఈ క్రమంలో అందులో ఓ సిరీస్ కోసం రుద్రవీణ అనే టైటిల్‌ని ఆయన ఫిక్స్ చేశారట. ఇక ఈ సిరీస్ హీరోయిన్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు దీనికి ప్రముఖ దర్శకుడు డైలాగ్‌లు రాస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.