
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో, హాస్యంతో అల్లరి సుభాషిణిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో హస్యనటిగా, సహయ నటిగా మెప్పించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవిత విశేషాలను పంచుకున్నారు. హైదరాబాద్ తో తనకున్న అనుబంధం, పరిశ్రమలో తన ప్రయాణం, ముఖ్యంగా దర్శకుడు రవి బాబు పాత్ర గురించి వివరించారు. సుభాషిణి తన ప్రస్థానాన్ని మద్రాస్ లోని నాటక రంగం నుండి ప్రారంభించారు. చింతామణి నాటకంలో ఆమె నటనను చూసిన చలపతిరావు గారు, ఆమెను అభినందించి తమ ఇంటికి ఆహ్వానించారు. ఆ తర్వాత పరుచూరి వెంకటేశ్వరరావు గారి నాటకాల్లో నటించే సమయంలో, చలపతిరావు గారు మళ్ళీ ఆమెను కలిసి, తన కుమారుడు రవి బాబు దర్శకత్వంలో రాబోతున్న అల్లరి సినిమా కోసం కలవమని సూచించారు. అలా మొదట రవి బాబును కలిసినప్పుడు ఆయనను చూసి చాలా భయం వేసిందని సుభాషిణి గుర్తుచేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
అల్లరి సినిమా కోసం ఆమెను ఎంపిక చేసిన తర్వాత, ఆమెకు నైటీ ధరించి నటించాల్సి ఉంటుందని తెలిపారు. మొదట సిగ్గుపడి, భయపడినా, రవి బాబు ప్రోత్సాహంతో ఆ పాత్రలో జీవించానని అన్నారు. ఈ సినిమా తర్వాత తిరుమల సుభాషిని కాస్త అల్లరి సుభాషిణిగా మారిపోయారు. ఈ సినిమా తన జీవితాన్ని మార్చిందని, ఇండస్ట్రీ తనకు చాలా పెద్ద భిక్ష పెట్టిందని ఆమె కృతజ్ఞతగా చెప్పారు. రవి బాబు తనకు ఎంతో సహాయం చేశారని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. అల్లరి తర్వాత రవి బాబు దర్శకత్వంలోనే వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు సినిమాలో క్యాట్ వాక్ చేయమని కోరినప్పుడు, మొదట ఆ డ్రెస్ వేసుకోవడానికి నిరాకరించినప్పటికీ, చివరకు దర్శకుడి మాట విని నటించి మంచి ప్రశంసలు అందుకున్నానని ఆమె చెప్పారు. ఈ సినిమా కూడా తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
తన కెరీర్‌లో రాఘవేంద్ర రావు, రామానాయుడు, ఈవీవీ సత్యనారాయణ వంటి ప్రముఖులు అండగా నిలిచారని సుభాషిణి గుర్తుచేసుకున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీ ఆంజనేయం సినిమా కోసం ఆయనే స్వయంగా తన సెల్ ఫోన్ కొనిచ్చి నంబర్ ఇప్పించారని, ఇప్పటికీ అదే నంబర్ వాడుతున్నానని చెప్పారు. టచ్ ఫోన్‌లకు దూరంగా ఉంటూ, నోకియా బేసిక్ ఫోన్‌లనే వాడుతున్న తన సింపుల్ జీవనశైలిని కూడా ఆమె పంచుకున్నారు. తాను ఏడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని, అయినా పరిశ్రమ తనను ఆదరించిందని ఆమె వినయంగా తెలిపారు. హైదరాబాద్, తెలంగాణ ప్రజలు తనను బాగా చూసుకున్నారని, అండగా నిలిచారని ఆమె కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
Allari Subhashini, Ravi Bab
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..